News March 27, 2025

ఆడబిడ్డ పుట్టడం అదృష్టం: ఖమ్మం కలెక్టర్

image

ఆడపిల్ల పుట్టడం అదృష్టమని, ఇంటిలో ఆడపిల్ల పుడితే స్వీట్ బాక్స్ అందించి శుభాకాంక్షలు తెలిపే విధంగా జిల్లాలో ‘మా పాప-మా ఇంటి మణిదీపం’ కార్యక్రమాన్ని బుధవారం ప్రారంభించడం చాలా సంతోషంగా ఉందని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం తల్లాడ మండలం రామచంద్రపురం గ్రామంలో కార్యక్రమాన్ని ఆయన లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఓ దంపతుల కుమార్తెను ఎత్తుకొని, సంబురం వ్యక్తం చేశారు.

Similar News

News April 10, 2025

కొత్తగూడెం: ‘200 ఎకరాల వ్యవసాయ భూమి కబ్జా’

image

కొత్తగూడెం(D) టేకులపల్లి(M) గంగారం రెవెన్యూ పరిధి సంపత్ నగర్‌లో కొందరు 200 ఎకరాల సాగు భూములకు నకిలీ పత్రాలు సృష్టించి కాజేయాలని చూస్తున్నారని బాధిత రైతులు ఆరోపిస్తున్నారు. ఓ మాజీ రౌడీ షీటర్, కేటీపీఎస్‌లో పని చేసే ఒక ఉద్యోగి, స్థానికుడు ఇదంతా నడిపిస్తున్నారంటున్నారు. గుడివాడ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో నాన్ జ్యుడీషరీ స్టాంప్ పేపర్ సృష్టించారని, ఈ ఆధారాలతో ఎస్పీకి ఫిర్యాదు చేస్తామని చెబుతున్నారు.

News April 10, 2025

భద్రాద్రి: 2నాటు తుపాకులు, పేలుడు పదార్థాలు స్వాధీనం

image

భద్రాద్రి(D) అశ్వారావుపేట(M) కంట్లం ఎఫ్‌బీఓలు గుబ్బల మంగమ్మ తల్లి గుడి సమీప అటవీ ప్రాంతంలో 2 నాటు తుపాకులు, పేలుడు పదార్థాలతో సంచరిస్తున్న ముగ్గురు వేటగాళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎఫ్ఆర్ఓ మురళి వివరాలు.. పోలీసులు గస్తీ నిర్వహించగా, అనుమానాస్పదంగా సంచరిస్తున్న ఏపీ(S) ఏలూరు(D) బుట్టాయగూడెంకు చెందిన కారం రవి, కామ మంగబాబు, వంజం నవీన్‌లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేశామని వివరించారు.

News April 10, 2025

ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి: ఖమ్మం కలెక్టర్

image

రఘునాథపాలెం: ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘాతో భద్రతా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ముజమ్మిల్ ఖాన్ అన్నారు. బుధవారం  కలెక్టరేట్ ఆవరణలోని ఈవీఎం గోడౌన్ నెలవారీ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఈవీఎం గోడౌన్ సీళ్లను కలెక్టర్ పరిశీలించారు. అగ్నిమాపక పరికరాలు, సిసి కెమెరాలను పరిశీలించారు. భద్రతా సిబ్బంది షిఫ్టుల వారి విధుల గురించి అడిగి తెలుసుకున్నారు.

error: Content is protected !!