News March 2, 2025
ఆత్మకూరులో చికెన్ ధరలు ఇలా..!

ఆత్మకూరు పట్టణంలో ఆదివారం చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. కేజీ లైవ్ చికెన్ ధర రూ. 96 ఉండగా స్కిన్‌తో కలిపి కిలో చికెన్ ధర రూ.160 పలుకుతోంది. అదే క్రమంలో స్కిన్ లెస్ కిలో చికెన్ ధర రూ. 200 చొప్పున విక్రయిస్తున్నారు. ఇదిలా ఉంటే బర్డ్ ఫ్లూ కలకలం నేపథ్యంలో ఇటీవల చికెన్ అమ్మకాలు తగ్గుముఖం పట్టి మటన్, చేపలకు మంచి డిమాండ్ పెరిగింది. దీంతో ఆత్మకూరులో కిలో మటన్‌ధర రూ. 800 లకు విక్రయిస్తున్నారు.
Similar News
News November 7, 2025
విశాఖను డ్రగ్స్‌కు అడ్డగా మార్చారు: పట్టభి రామ్

విశాఖ డ్రగ్స్ కేసులో YCP విద్యార్థి నాయకుడు కొండా రెడ్డి అరెస్టుతో రాజకీయాలు వేడెక్కాయి. TDP నేత పట్టాభి రామ్ గురువారం మాట్లాడుతూ .. ‘YCP యువజన విభాగం డ్రగ్స్ ముఠాగా మారింది. జగన్ హయాంలో విశాఖను డ్రగ్స్‌కు అడ్డాగా మార్చారు’అని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. దీనిపై మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ స్పందించారు. ‘కొండా రెడ్డి అరెస్టు అక్రమం. ప్రభుత్వం కక్షతో YCP నేతలను టార్గెట్ చేస్తోంది’ అని ఆరోపించారు.
News November 7, 2025
NRPT: కరాటేలో శిక్షణ ఇచ్చేందుకు దరఖాస్తుల ఆహ్వానం

నారాయణపేట విద్యాశాఖ అధికారి మౌఖిక ఆదేశాల మేరకు జిల్లాలోని 17 పీఎం శ్రీ పాఠశాలలో బాలికలకు కరాటే లో శిక్షణ ఇచ్చేందుకు కరాటే శిక్షకులు (కరాటే మాస్టర్లు) దరఖాస్తు చేసుకోవాలని జిల్లా యువజన క్రీడల శాఖ అధికారి వెంకటేష్ గురువారం ప్రకటనలో కోరారు. ఈ నెల 9 సాయంత్రం లోపు జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో గల డీవైఎస్‌వో కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని చెప్పారు. స్థానిక మహిళలకు ప్రాధాన్యత ఉంటుందన్నారు.
News November 7, 2025
SRCL: కవర్ కప్పలేదని టిప్పర్ సీజ్

స్టోన్ డస్ట్ రవాణా చేస్తున్న ఓ టిప్పర్‌ను పోలీసులు సీజ్ చేయడం పట్ల సర్వత్రా హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. వాహనాల తనిఖీలు నిర్వహించే సమయంలో ఆర్సీ, డ్రైవింగ్ లైసెన్సు, సరుకు రవాణా అనుమతి పత్రాలు మాత్రమే పరిశీలిస్తారు. దీనికి భిన్నంగా కవర్ కప్పకుండా తీసుకువెళ్తున్న స్టోన్ డస్ట్‌తో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారంటూ వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి టిప్పర్‌ను సీజ్ చేయడం నెట్టింట వైరల్‌గా మారింది.


