News April 14, 2024
ఆత్మకూరు ఎమ్మెల్యేపై కేసు నమోదు

ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. రంజాన్ పండగ సందర్భంగా నిర్వహించిన ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న విక్రమ్ రెడ్డి ఎన్నికల నిబంధనలను అతిక్రమించారని ఎంసీసీ నోడల్ అధికారి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఆత్మకూరు ఎస్సై ముత్యాలరావు తెలిపారు.
Similar News
News October 7, 2025
త్వరలో నెల్లూరుకు రానున్న పవన్..?

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ త్వరలో నెల్లూరు జిల్లా పర్యటనకు రానున్నట్లు సమాచారం. ఇటీవల పవన్ పర్యటనపై పలు వార్తలు వినిపించాయి. అయితే అక్టోబర్‌లో పవన్ పర్యటన దాదాపు ఖరారు అవుతుందని మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసులురెడ్డి ఇటీవల ప్రకటించారు. ఈ నేపథ్యంలో నెల్లూరు, ప్రకాశం జిల్లాల పర్యటనకు పవన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. మొత్తం మీద అక్టోబర్‌లోనే పవన్ నెల్లూరు రానున్నారని తెలుస్తోంది.
News October 6, 2025

ఆ మందు నెల్లూరు జిల్లాలో లేదు: రమేశ్

మధ్యప్రదేశ్‌లో కోల్డ్రిఫ్ దగ్గు మందు తాగి 11 మంది చిన్నారులు మృతి చెందిన విషయం తెలిసిందే. దీనిపై నెల్లూరు ఔషద నియంత్రణ శాఖ ఏడీ రమేశ్ రెడ్డిని Way2News ఫోన్లో సంప్రదించగా.. కోల్డ్రిఫ్ దగ్గు మందు నెల్లూరు జిల్లాలో లేదన్నారు. ఆ మందులో డై ఇథైలీన్ గ్లైకాల్ ఉన్నట్లు అధికారులు నిర్ధారించారన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు.