News January 20, 2025

ఆత్మకూరు: డ్రోన్ కెమెరాలతో పోలీసుల నిఘా

image

ఫైబర్ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఆత్మకూరు రూరల్ ఇన్‌స్పెక్టర్ సురేశ్ కుమార్ రెడ్డి తెలిపారు. పాములపాడు గ్రామ శివారులోని బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగడం, అసాంఘిక కార్యకలాపాలు, పేకాట వంటి వాటికి అడ్డుకట్ట వేసేందుకు డ్రోన్‌ కెమెరాలను వినియోగిస్తున్నట్లు పేర్కొన్నారు. డ్రోన్‌ కెమెరాలను ఉపయోగించి బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతున్న వారిని గుర్తించి, కేసులు నమోదు చేశామన్నాన్నారు.

Similar News

News February 18, 2026

కర్నూలు: మెడికల్ విద్యార్థిని సూసైడ్

image

గూడూరు(M) పెంచికలపాడు సమీపంలోని విశ్వభారతి మెడికల్ కాలేజీ విద్యార్థిని సోనిక(22) సూసైడ్ చేసుకుంది. ప్రకాశం(D) తుర్లపాడుకు చెందిన రత్నమయ్య కుమార్తె సోనిక పారామెడికల్ అనస్థీషియా మొదటి సంవత్సరం చదువుతోంది. తల్లిదండ్రుల మధ్య విభేదాల కారణంగా ఆమె కొంతకాలంగా మనస్తాపంతో ఉండేది. ఈ క్రమంలో మంగళవారం హాస్టల్ రూములో ఉరేసుకుంది. ఈ ఘటనపై కె.నాగలాపురం ఎస్ఐ అఖిల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

News February 18, 2026

కర్నూలు: హోలీ పండుగ సందర్భంగా ప్రత్యేక రైళ్లు

image

హోలీ పండుగ సందర్భంగా రైల్వే శాఖ తిరుపతి-రాక్సౌల్ మధ్య ప్రత్యేక రైళ్లు నడుపుతోంది. ఈనెల 21, 28న, మార్చి 7న తిరుపతి నుంచి ఉదయం 8.15 గంటలకు రైలు(07051) బయలుదేరి రెండో రోజు మధ్యాహ్నం 1.30 గంటలకు రాక్సౌల్ చేరుకుంటుంది. తిరిగి ఈనెల 24న, మార్చి 3, 10న ఉదయం 8.30 గంటలకు రాక్సౌల్ నుంచి బయలుదేరి రెండో రోజు సాయంత్రం 6.30 గంటలకు తిరుపతికి చేరుకుంటుంది. ఈ రైళ్లు గుంతకల్లు, ఆదోని, మంత్రాలయం మీదుగా నడుస్తాయి.

News February 18, 2026

గుంతల పూడ్చివేత వేగవంతం చేయాలి: కలెక్టర్

image

కర్నూలు జిల్లాలో రహదారుల గుంతల పూడ్చివేత పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఏ.సిరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో నిర్వహించిన సమీక్షా సమావేశంలో రోడ్ల నాణ్యత విషయంలో రాజీ పడకూడదని స్పష్టం చేశారు. ‘పాట్ హోల్ ఫ్రీ రోడ్స్’ లక్ష్యంతో పనులు సకాలంలో పూర్తి చేయాలన్నారు. బడ్జెట్ వివరాలు, పనుల పురోగతిపై నివేదిక ఇవ్వాలని అధికారులకు సూచించారు.