News April 27, 2024

ఆత్మకూరు: బాలింత మృతిపై వివాదం

image

ఆత్మకూరు వైద్యశాలలో బాలింత మృతిపై వివాదం నెలకొంది. అనంతసాగరం మండలం రేవూరుకి చెందిన భవాని రెండో కాన్పు కోసం రెండు రోజుల క్రితం వైద్యశాలలో చేరారు. శుక్రవారం ఉదయం మగబిడ్డకు జన్మనిచ్చింది. రాత్రి నొప్పులు అధికంగా ఉన్నాయనడంలో వైద్య సిబ్బంది ఇంజక్షన్ ఇచ్చారు. ఒక్కసారిగా పెదవి పక్కకు లాగి నూరుగు వచ్చింది. అత్యవసర వార్డుకు తరలించి సేవలందించారు. అయినా యువతి కోలుకోలేక మృతి చెందింది.

Similar News

News October 14, 2025

జిల్లా గిరిజన సంక్షేమ అధికారిగా సుజాత బాధ్యతలు

image

నెల్లూరు జిల్లా గిరిజన సంక్షేమ అధికారినిగా సుజాత బాధ్యతలు చేపట్టారు. గతంలో ఇక్కడ సంబంధిత శాఖ అధికారినిగా విధులు నిర్వహిస్తున్న పరిమళ బదిలీ కావడంతో కొద్ది కాలంగా ఈ పోస్ట్ భర్తీ కాలేదు. అల్లూరు సీతారామరాజు జిల్లా కూనవరంలో అసిస్టెంట్ ట్రైబల్ వెల్ఫేర్ అధికారిగా పని చేస్తున్న సుజాతకు ప్రమోషన్ లభించడంతో అధికారులు ఆమెను నెల్లూరుకు బదిలీ చేశారు.

News October 14, 2025

తగ్గిన డిమాండ్.. పతనమవుతున్న ధరలు

image

నెల్లూరు జిల్లాలో నిమ్మ ధరలు తగ్గుముఖం పట్టినట్లు వ్యాపారులు తెలిపారు. దేశ రాజధాని ఢిల్లీలో డిమాండ్ తగ్గడమే ఇందుకు కారణం అంటున్నారు. సాధారణంగా దీపావళికి డిమాండ్ ఉంటుందని, ఈ దఫా అవకాశం లేదంటున్నారు. ప్రస్తుతం ధర కిలో రూ.20 నుంచి రూ.30 వరకు పలుకుతుందన్నారు. రానున్న కాలంలో ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని వ్యాపారులు తెలిపారు.

News October 14, 2025

MROపై దౌర్జన్యం.. పోలీసులకు ఫిర్యాదు

image

లింగసముద్రంలో ఓ పార్టీకి చెందిన నాయకుడు వ్యవహరించిన తీరు స్థానికంగా చర్చనీయాంశమైంది. స్థానికుల సమాచారం ప్రకారం.. సోమవారం తాగిన స్థితిలో ఉన్న ఆయన డ్యూటీలో ఉన్న తహశీల్దార్‌పై ఆయన ఛాంబర్‌లోనే దౌర్జన్యానికి తెగబడి, నానా మాటలు అన్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. తనపై దౌర్జన్యం చేసిన యువకుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తహశీల్దార్ కోటేశ్వరరావు తెలిపారు.