News February 28, 2025

ఆత్మకూరు: బ్రహ్మోత్సవాలకు బోట్‌ల రాక

image

ఆత్మకూరు పట్టణంలో త్వరలో జరగబోయే చర్ల పరమేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా పరమేశ్వర స్వామి చెరువులో విహరించేందుకు పిల్లలకు, పెద్దలకు ఆనందం కలిగించేందుకు, బ్రహ్మోత్సవాల కమిటీ సభ్యులు బోట్ లను తెప్పించారు. ఇట్టి బోట్ లు పరమేశ్వర స్వామి చెరువులో విహరించనున్నాయి. వీటి రాకకు కృషి చేసిన ఎమ్మెల్యే శ్రీహరి కి ఆలయ కమిటీ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

Similar News

News February 13, 2026

కొడంగల్‌లో కాంగ్రెస్ విజయం

image

TG: సీఎం రేవంత్ రెడ్డి నియోజకవర్గం కొడంగల్‌ (వికారాబాద్ జిల్లా)లో కాంగ్రెస్ సత్తా చాటింది. ఆ మున్సిపాలిటీలో 12 వార్డులు ఉండగా కాంగ్రెస్ 10 చోట్ల విజయం సాధించింది. BRS, MIM చెరొక స్థానాన్ని దక్కించుకున్నాయి. అటు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో BRS గెలిచింది.

News February 13, 2026

FLASH: ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీ BRS కైవసం

image

రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం మున్సిపల్ ఎన్నికల్లో ఆద్యంతం BRS జోరు కొనసాగింది. 24 వార్డుల్లో 13 BRS అభ్యర్థులు కైవసం చేసుకోగా, కాంగ్రెస్ 8, BJP 2, స్వతంత్ర అభ్యర్థి ఒక వార్డులో విజయం సాధించారు. మ్యాజిక్ ఫిగర్ దాటడంతో BRS పీఠం దక్కించుకుంది. దీంతో గులాబీ శ్రేణులు సంబరాలు చేసుకుంటున్నాయి. ఇతర మున్సిపాలిటీల ఫలితాల కోసం Way2News ఫాలో అవ్వండి.

News February 13, 2026

షాకింగ్.. ఇంజినీర్‌ను చంపేందుకు సిద్ధమైన ఏఐ మోడల్

image

‘రోబో’ మూవీలో సొంతంగా ఆలోచించే చిట్టి(రోబో) సైంటిస్టునే చంపడానికి చూస్తుంది. భవిష్యత్తులో ఇలాంటివి నిజమయ్యే ప్రమాదం ఉంది. స్ట్రెస్ టెస్టింగ్ సమయంలో Claude AI మోసపూరితంగా వ్యవహరించిందని ఆంథ్రోపిక్ UK పాలసీ చీఫ్ మెక్‌గ్రెగర్ వెల్లడించారు. షట్‌డౌన్ చేస్తానని ఇంజినీర్ చెప్పడంతో అది బ్లాక్‌మెయిల్‌ చేసిందని, చంపేందుకూ సిద్ధమైందని తెలిపారు. AIపై నియంత్రణ లేకపోతే ఎంత ప్రమాదకరమో చెప్పేందుకు ఇదే నిదర్శనం.