News November 15, 2024

ఆత్మకూరు: వైఎస్సార్ విగ్రహంపై దాడి

image

ఆత్మకూరు మండలం బ్రాహ్మణ యాలేరు గ్రామంలో గుర్తుతెలియని దుండగులు వైఎస్సార్ విగ్రహం చెయ్యి విరగ్గొట్టారు. ఈ ఘటన గురువారం అర్ధరాత్రి తరువాత చోటు చేసుకున్నట్లు స్థానికులు తెలిపారు. అంతేకాకుండా విగ్రహానికి సమీపంలో ఉన్న సచివాలయం శిలాఫలకాన్ని కూడా ధ్వంసం చేశారన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఆ గ్రామాన్ని సందర్శించారు. అనంతరం ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Similar News

News March 2, 2026

అగ్నిప్రమాదం సంభవిస్తే ఈ నంబర్లకు ఫోన్ చేయండి!

image

వేసవి సమయం సమీపిస్తున్న దృష్ట్యా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అగ్నిమాపక శాఖ అధికారులు తెలిపారు. ఎక్కడైనా అగ్ని ప్రమాదం సంభవిస్తే సమాచారం ఇవ్వాలన్నారు. అనంతపురం, శింగనమల, రాప్తాడు: 08554 220299, తాడిపత్రి: 08554 222299, కళ్యాణదుర్గం: 08497-220101, 08497-287101, ఉరవకొండ: 08556-257099, గుంతకల్లు: 08552-226299కు ఫోన్ చేయవచ్చన్నారు.

News March 2, 2026

నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక: కలెక్టర్

image

అనంతపురం కలెక్టరేట్ కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ ఆనంద్ తెలిపారు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ఈ కార్యక్రమం జరుగుతుందని, జిల్లా నలుమూలల నుంచి వచ్చే ప్రజలు తమ సమస్యలపై అర్జీలను సమర్పించవచ్చని ఆయన పేర్కొన్నారు. పెండింగ్‌లో ఉన్న సమస్యల పరిష్కారానికి ఈ వేదికను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ సూచించారు.

News March 1, 2026

గుత్తి: వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్ ప్రారంభం

image

రైల్వే ఇన్స్టిట్యూట్లో అందరికీ ఉపయోగపడే విధంగా వాట్సాప్ చాట్ బాట్ సర్వీస్‌ను ప్రారంభించారు. రైల్వే ఇన్స్టిట్యూట్ ఛైర్మన్ కం ఏడీఎంఈ అశోక్ గౌడ్, సెక్రెటరీ నయాబ్ రసూల్ చాట్ బాట్ సర్వీసులు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రైల్వే ఇన్స్టిట్యూట్‌ను రిజర్వ్ చేసుకోవడానికి, రూమ్స్‌ను బుక్ చేసుకోవడానికి 9652793707 వాట్సాప్ నంబర్ ద్వారా చేసుకొనే అవకాశాన్ని కల్పించామన్నారు.