News February 2, 2025
ఆత్మకూర్ : మేకలు, గొర్రెల దొంగల ముఠా అరెస్ట్

గోర్లు, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు కాప్రాయిపల్లి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLGజిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నాన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News November 9, 2025
వరంగల్ కమిషనరేట్ పరిధిలో 102 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు

మద్యం తాగి వాహనాలు నడపడం ద్వారా జరిగే రోడ్డు ప్రమాదాల నివారణకు తీసుకుంటున్న చర్యల్లో భాగంగా మంగళవారం వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టారు. ఈ తనిఖీల్లో మొత్తం 102 కేసులు నమోదయ్యాయి. ఇందులో ట్రాఫిక్ విభాగంలో 64, సెంట్రల్ జోన్ పరిధిలో 16, వెస్ట్ జోన్ పరిధిలో 9, ఈస్ట్ జోన్ పరిధిలో 13 కేసులు నమోదయ్యాయి.
News November 9, 2025
HYD: తండ్రి మరణం తట్టుకోలేక యువతి సూసైడ్

నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం నెలకొంది. తండ్రి మరణాన్ని తట్టుకోలేక సౌమ్య అనే యువతి ఆత్మహత్యకు పాల్పడింది.బ్లాక్ నంబర్–4 అపార్ట్‌మెంట్స్‌లోని మూడో అంతస్తు నుంచి దూకిన ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తరలించగా ప్రాణాలు నిలువలేదు. సమాచారం అందుకున్న నార్సింగి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.