News February 2, 2025
ఆత్మకూర్ : మేకలు, గొర్రెల దొంగల ముఠా అరెస్ట్
గోర్లు, మేకలను దొంగలిస్తున్న ముఠాను అరెస్టు చేసినట్లు చౌటుప్పల్ ACP మధుసూదన్ రెడ్డి తెలిపారు. ఆత్మకూరు కాప్రాయిపల్లి వాహన తనిఖీల్లో పట్టుబడినట్లు వెల్లడించారు. NLGజిల్లాకు చెందిన వెంకటేశ్, రావుల శివ, శ్రీనివాస్ రెడ్డి, విజయ్ ప్రసాద్‌లు ముఠాగా ఏర్పడి దొంగతనాలు చేస్తున్నారన్నారు. వీరికి సహకరించిన శారద, నందినిలు పరారీలో ఉన్నట్లు తెలిపారు. జల్సాలకు అలవాటు పడి చోరీలు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News February 2, 2025
NLG: 99 మంది బాల కార్మికులకు విముక్తి
ఆపరేషన్ స్మైల్ 11వ విడత కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 99 మంది బాల కార్మికులకు విముక్తి కల్పించారు. అన్ని శాఖల సమన్వయంతో యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో జనవరి 1 నుంచి 31 వరకు ఆపరేషన్ స్మైల్-11 కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా చేపట్టామని జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ తెలిపారు. చిన్న పిల్లలను పనిలో పెట్టుకున్న 61 మంది వ్యక్తులపై కేసులు నమోదు చేశారు.
News February 2, 2025
పెద్దగట్టు జాతరకు నిధులు విడుదల
దూరజ్‌పల్లి లింగమంతుల స్వామి (పెద్దగట్టు) జాతరకు ప్రభుత్వం శనివారం నిధులు విడుదల చేసింది. జాతర ఏర్పాట్ల కోసం రూ.5 కోట్లు కేటాయిస్తూ అధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. ఈ నెల 16 నుంచి 20వ తేదీ వరకు జాతర జరగనుంది. నేడు ఆలయం వద్ద దిష్టి పూజ నిర్వహించనున్నారు. ప్రతి రెండేళ్లకు ఒకసారి ఘనంగా జరుగుతుంది. వివిధ రాష్ట్రాల నుంచి లక్షలాది మంది తరలివస్తారు. దీంతో పెద్దగట్టు పరిసరాలు కుంభమేళాను తలపిస్తాయి.
News February 2, 2025
నేటి నుంచే చెరువుగట్టు బ్రహ్మోత్సవాలు
చెర్వుగట్టు శ్రీ పార్వతీ జడల రామలింగేశ్వర స్వామి దేవాలయం వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు అధికారులు భక్తులకు వసతులు, ఆలయానికి రంగులు, పారిశుద్ధ్యం, మంచినీటి వసతిలో ఇబ్బందులు లేకుండా చూసేందుకు ఏర్పాట్ల పనులలో నిమగ్నమై ఉన్నారు. ఈసారి జాతరకు సుమారుగా 12 లక్షల వరకు భక్తులు రావచ్చని అంచనా వేశారు.