News December 29, 2024
ఆత్మరక్షణ విద్యగా తైక్వాండో సాధన చేయాలి: టీజీ వెంకటేశ్
ప్రతి విద్యార్థి ఆత్మరక్షణ విద్యగా టైక్వాండో సాధన ప్రతిరోజు చేయాలని మాజీ రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేశ్ అన్నారు. ఆదివారం నగరంలోని ఆఫీసర్స్ క్లబ్‌లో జరిగిన జిల్లా స్థాయి తైక్వాండో ఎంపిక పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఆయన బహుమతులను అందజేశారు. ఆయన మాట్లాడుతూ.. తైక్వాండో లాంటి మార్షల్ ఆర్ట్స్‌లో నిరంతరం సాధన చేస్తే క్రమశిక్షణతో పాటు శారీరక అభివృద్ధి కలుగుతుందన్నారు.
Similar News
News January 1, 2025
మొన్నటి వరకు కాసులు.. ఇప్పుడు కన్నీళ్లు!
పత్తికొండ మార్కెట్‌లో టమాటా ధరలు భారీగా పడిపోయాయి. రెండు నెలల కిత్రం సెంచరీ కొట్టిన ధరలు ప్రస్తుతం ₹2 కూడా పలకని పరిస్థితి నెలకొంది. 25కిలోల బాక్సు కేవలం రూ.30కి అమ్ముకోవాల్సి వస్తోందని రైతులు వాపోతున్నారు. కూలీల ఖర్చులు రావడంలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో సుమారు 40 నుంచి 50 వేల ఎకరాల్లో టమాటా సాగుచేస్తారు. ప్రధానంగా పత్తికొండ, తుగ్గలి, దేవనకొండ, ఆలూరు తదితర మండలాల్లో ఈ పంట సాగు అధికం.
News January 1, 2025
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవు: కలెక్టర్
ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ పీ.రంజిత్ బాషా హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్ మినీ కాన్ఫరెన్స్ హాల్‌లో జిల్లాస్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఇసుక అక్రమ రవాణా జరగకుండా పూర్తి స్థాయిలో చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.
News January 1, 2025
వైసీపీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా ఎస్కే గిరి
వైసీపీ అధ్యక్షుడు వైస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కర్నూలు జిల్లా ఉపాధ్యక్షుడిగా హొళగుంద మండలానికి చెందిన ఎస్‌కే గిరిని మంగళవారం నియమించారు. ఎస్‌కే గిరి మాట్లాడుతూ.. కార్యకర్తలకు అందుబాటులో ఉంటూ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. తనకు ఈ బాధ్యతలు అప్పగించిన వైస్ జగన్మోహన్ రెడ్డికి, ఎమ్మెల్యే విరుపాక్షికి రుణపడి ఉంటానన్నారు.