News April 8, 2025
ఆత్రేయపురం: రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి

ఆత్రేయపురం మండలం మెర్లపాలెంలో లారీ ఢీకొని గుర్తుతెలియని యువకుడు మంగళవారం మృతి చెందాడు. ఏపీ 37 3865 నంబర్ కలిగిన బైక్‌పై వెళ్తున్న యువకుడిని ఇసుక లోడుకు వెళ్తున్న టిప్పర్ ఢీ కొట్టిందని స్థానికులు తెలిపారు. దీంతో అతడు అక్కడికక్కడే మృతి చెందాడు. దీనిపై ఆత్రేయపురం పోలీసులు విచారణ చేపట్టారు.
Similar News
News April 17, 2025
ఉమ్మడి ప.గో.జిల్లాకు 100 ఏళ్లు పూర్తి

ఏలూరు కేంద్రంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా 1925 ఏప్రిల్ 15న అవతరించింది. దీంతో ఏలూరు కేంద్రం వందేళ్లు పూర్తి చేసుకుందని అధికారులు తెలిపారు. 1931 జనాభా లెక్కల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 13 లక్షల మంది జనాభా ఉండగా.. 37.99 లక్షలకు చేరింది. 100 ఏళ్లు పూర్తి చేసుకున్న ఉమ్మడి ప.గో జిల్లాలో భక్తి పారవశమైన ఆలయాలు, విదేశీయులను ఆకర్షించే కొల్లేరు పర్యాటక ప్రాంతాలు ఉన్నాయి.
News April 17, 2025
స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయండి: మేయర్

వేగవంతంగా స్విమ్మింగ్ పూల్ నిర్మాణ పనులు పూర్తి చేయాలని వరంగల్ మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. బల్దియా ప్రధాన కార్యాలయ ఆవరణలో ఇండోర్ స్టేడియం ప్రాంతంలో సుమారు రూ.1.50 కోట్ల అంచనా వ్యయంతో నిర్మిస్తున్న స్విమ్మింగ్ ఫూల్ నిర్మాణ పనులను మేయర్ బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పనులు కొనసాగుతున్న తీరు పట్ల ఆమె అసంతృప్తి వ్యక్తం చేశారు. పనుల్లో జాప్యం సరికాదన్నారు.
News April 17, 2025
మహా ముత్తారం అడవిలో పెద్దపులి సంచారం.. క్లారిటీ

మహా ముత్తారం మండలంలో పెద్దపులి సంచారం కలకలం సృష్టిస్తోంది. అడవిలో పులి సంచరిస్తుందని ఫొటోలు, వీడియోలు వైరల్ కావడంతో అటవీ సమీప గ్రామాల ప్రజలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. అయితే ఈ విషయమై అధికారులను Way2News వివరణ కోరగా.. గతంలో సంచరించిన పులి అడుగుల ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయని, మండలంలో పులి సంచారం లేదని అధికారులు స్పష్టం చేశారు. ప్రజలు భయాందోళనకు గురికావద్దని సూచించారు.