News October 8, 2025

ఆద‌ర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు పోటీప‌డి ప‌నిచేయాలి: కలెక్టర్

image

ఆద‌ర్శ ఉపాధ్యాయులుగా నిలిచేందుకు, విద్యార్థుల‌ను ఉత్త‌మంగా తీర్చిదిద్దేందుకు పోటీప‌డి ప‌నిచేయాల‌ని ఇటీవ‌ల డీఎస్సీలో ఎంపికైన ఉపాధ్యాయలను ఉద్దేశించి క‌లెక్ట‌ర్ హ‌రేంధిర ప్ర‌సాద్ అన్నారు. డీఎస్సీలో ఎంపికైన అభ్య‌ర్థులకు మ‌ధురువాడలో ఏర్పాటు చేసిన ఇండక్ష‌న్ ట్రైనింగ్ శిబిరాన్ని విశాఖ క‌లెక్ట‌ర్ బుధవారం సంద‌ర్శించారు. క‌ల‌కాలం విద్యార్థులు మిమ్మ‌ల్ని గుర్తుంచుకునేలా వినూత్న రీతిలో బోధించాల‌ని సూచించారు.

Similar News

News October 8, 2025

ఏయూ: పీజీ, పీజీ డిప్లమో సెల్ఫ్ సపోర్ట్ కోర్సులకు ప్రవేశాలు

image

ఏయూ నిర్వహిస్తున్న వివిధ పీజీ, పీజీ డిప్లమో సెల్ఫ్ సపోర్ట్ కోర్సుల్లో ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు సంచాలకులు డి.ఏ.నాయుడు తెలిపారు. మాస్టర్ ఆఫ్ హాస్పిటల్ అడ్మినిస్ట్రేషన్, పీజీ డిప్లమా ఇన్ క్రిటికల్ కేర్ టెక్నాలజీ, ఎమర్జెన్సీ మెడిసిన్ టెక్నాలజీ, గ్యాస్ట్రోఎంటరాలజీ టెక్నాలజీ కోర్సుల్లో ప్రవేశాలు కలవు. దరఖాస్తు, ఫీజుల వివరాలు, ప్రవేశాలు, అర్హత వివరాలు ఏయూ వెబ్‌సైట్‌లో పొందుపరిచారు.

News October 8, 2025

మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి: హోంమంత్రి అనిత

image

విశాఖలో ఫిక్కీ ఫ్లో ఆధ్వర్యంలో మహిళా భద్రత, సాధికారతపై సదస్సు జరిగింది. మహిళల ఆర్థిక స్వావలంబనతోనే దేశాభివృద్ధి సాధ్యమని హోంమంత్రి వంగలపూడి అనిత ఉద్ఘాటించారు. మహిళల భద్రతకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందని, ‘శక్తి యాప్’ను ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. ఉన్నత స్థానాల్లో ఉన్న మహిళలు, తోటి మహిళల అభ్యున్నతికి పాటుపడాలని పిలుపునిచ్చారు.

News October 8, 2025

వైజాగ్‌కు మణిహారం ‘బీచ్ కారిడార్’

image

విశాఖ తీరప్రాంతానికి సరికొత్త అందాలు అద్దే ‘బీచ్ కారిడార్’ పనులు శరవేగంగా సాగుతున్నాయి. భీమిలి వరకు 6 వరుసల రహదారిగా విస్తరించడంతో పాటు, ప్రపంచస్థాయి పర్యాటక వసతులు, హోటళ్లు, రిసార్టులు ఏర్పాటు చేయనున్నారు. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే నగరం అంతర్జాతీయ పర్యాటక కేంద్రంగా మారుతుందని అధికారులు ధీమా వ్యక్తం చేస్తున్నారు.