News March 19, 2025
ఆదర్శ పాఠశాల ప్రవేశ పరీక్షలకు ఆహ్వానం : డీఈవో రాము

జగిత్యాల జిల్లాలోని ఆదర్శ పాఠశాలల్లో 2025-26కు తరగతి ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ రాము తెలిపారు. 7, 8, 9, 10వ తరగతుల్లో ఖాళీ సీట్ల భర్తీ కోసం విద్యార్థుల నుంచి ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరిస్తున్నారు. స్వీకరణకు చివరి తేదీ ఈనెల 20. హాల్ టికెట్ల డౌన్‌లోడ్ ఏప్రిల్ 21. పరీక్ష తేదీ 27.
Similar News
News March 19, 2025
KMR: విద్యుత్ షాక్‌తో వ్యక్తి మృతి

కామారెడ్డి జిల్లా బిక్కనూర్ మండలం బస్వాపూర్ గ్రామంలో నూతనంగా నిర్మిస్తున్న ఆరోగ్య ఉపకేంద్ర నిర్మాణ పనుల్లో అపశృతి చేసుకుంది. మెదక్ జిల్లా రామాయంపేటకు చెందిన రాములు(42) అనే వ్యక్తికి బుధవారం పని చేస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ వైర్లు తాకడంతో అతను అక్కడికక్కడే మృతి చెందినట్లు గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని స్థానిక పోలీసులకు సమాచారం అందించారు.
News March 19, 2025
సిద్దిపేట: కస్తూర్భాను తనిఖీ చేసిన అదనపు కలెక్టర్

చేర్యాల మండల కేంద్రంలోని కస్తూర్బా బాలికల పాఠశాలను జిల్లా అదనపు కలెక్టర్ గరిమా అగర్వాల్ తనిఖీ చేశారు. అనంతరం టెన్త్ క్లాస్ విద్యార్థినులకు కాసేపు పాఠాలు బోధించారు. వారు మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ శ్రద్ధతో చదవాలని, ఎలాంటి సందేహాలు ఉన్నా ఉపాధ్యాయులతో చర్చించి నివృత్తి చేసుకోవాలన్నారు. ఈ సందర్భంగా పాఠశాలలోని వసతి రూం, కిచెన్ సందర్శించి మెనూ ప్రకారమే నాణ్యమైన భోజనం అందించాలని ప్రిన్సిపల్ కు సూచించారు.
News March 19, 2025
కన్నుల పండువగా రాజరాజేశ్వర స్వామి రథోత్సవం

దక్షిణకాశీగా పేరొందిన ప్రసిద్ధ శైవక్షేత్రమైన వేములవాడలోని శ్రీరాజరాజేశ్వరస్వామి రథోత్సవం బుధవారం సాయంత్రం కన్నుల పండువగా జరిగింది. శివ కళ్యాణోత్సవంలో భాగంగా రాజరాజేశ్వరి స్వామి పార్వతి అమ్మవారు కళ్యాణం జరిగిన మూడోరోజు సాయంత్రం స్వామివారి రథోత్సవం నిర్వహిస్తారు. రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. పెద్దసంఖ్యలో భక్తులు తరలివచ్చి రథోత్సవంలో పాల్గొన్నారు.