News August 29, 2025

ఆదిత్యుని ఆలయం మూసివేత

image

వచ్చే నెల 7న సంపూర్ణ చంద్ర గ్రహణం సందర్భంగా అరసవల్లి శ్రీ సూర్యనారాయణస్వామి దేవాలయాన్ని మూసివేస్తామని ఆలయ ఈవో ప్రసాద్ శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఆ రోజున స్వామి వారికి నిత్యార్చనాలు, నివేదన అనంతరం మధ్యాహ్నం 2 గంటలకు దేవాలయాన్ని మూసివేసి, 8న ఉదయం తెరిచి సంప్రోక్షణం, శుద్ధి కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. 8న ఉ. 7:30 నుంచి భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామన్నారు.

Similar News

News August 29, 2025

విద్యుత్ అధికారులతో సమీక్షించిన మంత్రి అచ్చెన్న

image

కోటబొమ్మాళి మండలం నిమ్మాడ మంత్రి క్యాంప్ కార్యాలయంలో మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు శుక్రవారం విద్యుత్ అధికారులతో ఫోన్లో మాట్లాడి సమీక్ష జరిపారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సమస్య రాకుండా చూడాలన్నారు. కరెంటు సమస్యలపై వస్తున్న ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు.

News August 29, 2025

కంచిలి: రైలు ప్రయాణికులకు గమనిక

image

బ్మహపురం నుంచి సోంపేట మీదుగా విశాఖకు వెళ్లే ప్యాసింజర్ రైలు అనివార్య కారణాలతో మంగళవార, గురువారం, శుక్రవారం మాత్రమే నడుస్తుందని రైల్వే అధికారులు తెలిపారు. ప్రతి రోజు ఉదయం 4:20 గంటలకు బరంపురం నుంచి విశాఖపట్నం ప్రయాణించే ప్యాసింజర్ రైలు సర్వీసును నియంత్రించడంతో ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు.

News August 29, 2025

రణస్థలం: యాక్సిడెంట్‌లో 20 ఏళ్ల యువకుడి మృతి

image

రణస్థలం మండలం సీతంవలస సమీపంలో గురువారం ద్విచక్ర వాహనం బోల్తా పడి యువకుడు మృతి చెందాడు. జెఆర్‌పురం ఎస్సై చిరంజీవి తెలిపిన వివరాల ప్రకారం..కేటీఎం బైక్‌పై ఇద్దరు యువకులు జెఆర్‌పురం నుంచి లావేరు అతివేగంగా వెళ్తుండగా వాహనం అదుపు తప్పి ప్రమాదానికి గురయ్యారు. యాక్సిడెంట్‌లో బైక్ నడుపుతున్న ప్రభాస్ (20)మృతి చెందాడు. రాంబాబుకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.