News April 12, 2024
ఆదిలాబాద్‌కు ఆరంజ్, ఎల్లో అలర్ట్ జారీ
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు శుక్రవారం HYD వాతావరణ కేంద్రం ఆరెంజ్, ఎల్లో అలెర్ట్ జారీ చేసింది. ఈ సందర్భంగా రెండు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు పడతాయని వెల్లడించింది. ఆదిలాబాద్, ఆసిఫాబాద్, నిర్మల్ జిల్లాలకు ఆరెంజ్, మంచిర్యాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. దీంతో ప్రజలు సాయంత్రం పూట బయటకు వెళ్లకుండా అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరుతున్నారు.
Similar News
News January 5, 2025
ఆదిలాబాద్: చెప్పుల షాపులో చోరీ.. దొంగ అరెస్ట్
ఇటీవల చెప్పుల షాపులో దొంగతనం చేసిన వ్యక్తిని పట్టుకొని అరెస్ట్ చేసినట్లు ఆదిలాబాద్ 1 టౌన్ CI సునీల్ కుమార్ తెలిపారు. ఈనెల 2న చెప్పుల షాప్‌లో రూ.2వేల నగదును దొంగిలించారు. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదైంది. కాగా శనివారం పట్టణంలోని పంజాబ్ చౌక్‌లో ఎస్ఐ అశోక్ వాహనాలు తనిఖీ చేస్తుండగా దొంగ పట్టుబడ్డారు.
News January 5, 2025
ADB: ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో చలి పంజా విసురుతోంది. శనివారం ఉష్ణోగ్రతలు అతి అల్పానికి చేరుకున్నాయి. కుమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో అత్యల్పంగా సిర్పూర్(U) 6.1, ఆదిలాబాద్ జిల్లాలో అర్లి(T) 6.2, నిర్మల్ జిల్లాలో కుబీర్ 8.8, మంచిర్యాల జిల్లాలో జైపూర్ 10.4 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని హైద్రాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ఉమ్మడి జిల్లా వాసులు తగు జాగ్రత్తలు వహించాలని వైద్యులు సూచిస్తున్నారు.
News January 4, 2025
కడెం: రేపు సాగు నీటిని విడుదల చేయనున్న ఎమ్మెల్యే
ఖానాపూర్ నియోజకవర్గంలోని సదర్మాట్, కడెం ప్రాజెక్టుల ఆయకట్టు పరిధిలోని రైతుల పొలాలకు ఎమ్మెల్యే బొజ్జు సాగునీటిని విడుదల చేయనున్నారని ఇరిగేషన్ అధికారులు వెల్లడించారు. రబీ సీజన్‌కు సంబంధించి ఆయా ప్రాజెక్టుల పరిధిలో ఉన్న రైతుల పొలాల్లో వేసే పంటల కోసం ఖానాపూర్ ఎమ్మెల్యే బొజ్జు ఆదివారం ఉదయం 10 గంటలకు సాగునీటిని విడుదల చేయనున్నారని వారు వెల్లడించారు. విషయాన్ని రైతులు, అందరూ గమనించాలని వారు సూచించారు.