News October 31, 2025
ఆదిలాబాద్‌లో క్రీడాకారుల ఎంపిక పోటీలు

జిల్లా పాఠశాల క్రీడా సమాఖ్య ఆధ్వర్యంలో ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో U-17 జోనల్ లెవల్ స్పోర్ట్స్ ఎంపిక పోటీలు జరగనున్నాయి. నవంబర్ 3న బాలబాలికల రగ్బీ, 4న బాలుర కబడ్డీ, 5న బాలికల క్రికెట్ పోటీలు నిర్వహించనున్నారు. క్రీడాకారులు సంబంధిత పోటీల్లో పాల్గొనేందుకు ఆరోజు ఉదయం 10 గంటలలోపు హాజరుకావాలని పోటీల కన్వీనర్లు తెలిపారు.
Similar News
News October 31, 2025
3 రాష్ట్రాల్లో పోటీ.. ఓ గెలుపు.. తొలిసారి మంత్రి

TG: టీమ్ ఇండియా మాజీ కెప్టెన్, <<18158294>>మంత్రి అజహరుద్దీన్<<>> పొలిటికల్ జర్నీ 3 రాష్ట్రాల మీదుగా సాగింది. 2009లో INCలో చేరిన ఆయన మొరదాబాద్(UP) ఎంపీగా గెలిచారు. 2014లో టోంక్ సవాయూ మాధోపుర్(రాజస్థాన్) లోక్‌సభ స్థానంలో ఓడిపోయారు. 2019లో టికెట్ దక్కలేదు. 2023లో సొంతరాష్ట్రం తెలంగాణలోని జూబ్లీహిల్స్ MLAగా పోటీ చేసి పరాజయం పాలయ్యారు. ప్రత్యేక రాజకీయ పరిస్థితుల మధ్య ఇవాళ మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు.
News October 31, 2025
RITESలో 600 పోస్టులు.. అప్లై చేశారా?

రైల్ ఇండియా టెక్నికల్ అండ్ ఎకనామిక్ సర్వీస్ లిమిటెడ్(RITES)లో 600 సీనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. బీఎస్సీ, డిప్లొమా ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం గలవారు నవంబర్ 12వరకు అప్లై చేసుకోవచ్చు. అభ్యర్థుల గరిష్ఠ వయసు 40ఏళ్లు. దరఖాస్తు ఫీజు రూ.300, SC,ST, PWBDలకు రూ.100. వెబ్‌సైట్: https://www.rites.com
News October 31, 2025
కాసిపేట: విద్యార్థులకు మెనూ ప్రకారం ఆహారం అందించాలి: కలెక్టర్

కాసిపేట మండల కేంద్రంలోని కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాన్ని కలెక్టర్ కుమార్ దీపక్ శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. తరగతి గదులు, వంటశాల, రిజిస్టర్లు, మధ్యాహ్న భోజనం నాణ్యత, ఇంటర్మీడియట్ అదనపు తరగతి గదుల నిర్మాణ పనులు, పరిసరాలను పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. విద్యార్థులకు మెనూ ప్రకారం సకాలంలో ఆహారం, శుద్ధమైన తాగునీటిని అందించాలని సూచించారు.


