News August 22, 2025
ఆదిలాబాద్‌లో గణేశ్ ఉత్సవాలకు డీజేలు నిషేధం

ఆదిలాబాద్ జిల్లాలోని గణపతి నవరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలో డీజేలకు అనుమతి లేదని డీఎస్పీ జీవన్ రెడ్డి తెలిపారు. డీజేలను పూర్తిగా నిషేధిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. గణపతి మండపాల వద్ద సౌండ్ బాక్సులు, మైక్ సెట్ల కోసం తప్పనిసరిగా అనుమతులు తీసుకోవాలన్నారు. మహారాష్ట్ర నుంచి డీజేలను అద్దెకు తెచ్చి ఇచ్చేవారిపై కఠినంగా చర్యలు తీసుకుంటామన్నారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు.
Similar News
News February 16, 2026
ఇంటర్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి: ADB కలెక్టర్

జిల్లాలో ఈ నెల 25 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్మీడియట్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని కలెక్టర్ రాజర్షి షా సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం పరీక్షల నిర్వహణకు సంబంధించి చేపట్టిన ఏర్పాట్లపై ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఫిబ్రవరి 25 నుంచి మార్చి 18 వరకు జరగనున్న పరీక్షలను కట్టుదిట్టంగా నిర్వహించాలని సూచించారు.
News February 16, 2026
ADB: ఎల్లుండి స్కూల్స్‌కు సెలవు

ఈ నెల 18న ఆదిలాబాద్‌లోని రామ్ లీలా మైదానంలో నిర్వహించనున్న శ్రీ సంత్ సేవాలాల్ మహారాజ్ అధికార జయంతి వేడుకలను నిర్వహించనున్నారు. ఈ నెల 18న బుధవారం ప్రభుత్వ, ప్రైవేట్ విద్యా సంస్థలకు సెలవు ప్రకటిస్తున్నట్లు కలెక్టర్ రాజర్షి షా ఉత్తర్వులు జారీ చేశారు. వచ్చే ఏప్రిల్ నెలలో రెండవ శనివారాన్ని పని దినంగా పరిగణించాలని, ఈ విషయాన్ని ఆయా విద్యా సంస్థల యాజమాన్యాలు గమనించాలని సూచించారు.
News February 16, 2026
ఎన్నికల కోడ్ ఉపసంహరణ: ADB కలెక్టర్

ఆదిలాబాద్ మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల ప్రవర్తనా నియమావళిను తక్షణమే ఉపసంహరించినట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. మున్సిపల్ ఛైర్‌పర్సన్, వైస్ ఛైర్‌పర్సన్ పదవులకు నిర్వహించిన పరోక్ష ఎన్నికల ప్రక్రియ విజయవంతంగా పూర్తికావడంతో ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన పేర్కొన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తిగా ముగిసినందున మున్సిపాలిటీ పరిధిలో అమలులో ఉన్న ఎన్నికల నిబంధనలు ఇకపై వర్తించవని స్పష్టం చేశారు.


