News March 5, 2025

ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు

image

ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో బుధవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,900గా నిర్ణయించారు. మంగళవారం ధరతో పోలిస్తే బుధవారం సీసీఐ ధరలో మార్పు లేదు. ప్రైవేట్ పత్తి ధరలో సైతం ఎటువంటి మార్పు లేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.

Similar News

News March 6, 2025

సిరికొండలో విద్యుత్ షాక్‌తో యువకుడి మృతి

image

విద్యుదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన ఘటన సిరికోండలో చోటుచేసుకుంది. ఎస్ఐ శివరాం వివరాల ప్రకారం.. తుమ్మలపాడ్ గ్రామానికి చెందిన విలాస్(28) ఇంటి గోడకున్నా విద్యుత్‌ వైర్ షాక్ తగలడంతో విద్యుదాఘాతానికి గురయ్యాడు. వెంటనే స్థానికులు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్థారించారు. విలాస్ తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ వెల్లడించారు.

News March 6, 2025

ఆదిలాబాద్: ఇందిరమ్మ ఇళ్లపై కలెక్టర్ సమీక్ష

image

ADB కలెక్టరేట్ సమావేశ మందిరంలో ఇందిరమ్మ ఇళ్లపై సంబంధిత మండలాల అధికారులతో కలెక్టర్ రాజర్షి షా సమీక్ష నిర్వహించారు. 17 మండలాల్లోని 17 గ్రామపంచాయితీల్లో ఎంపికైన 2,148 ఇళ్లకు మార్కింగ్ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. మిగిలిన అన్ని గ్రామాల్లోని ఇళ్లకు సంబందించిన వెరిఫికేషన్ ప్రక్రియను ఈ నెల 7లోగా పూర్తిచేసి నివేదిక సమర్పించాలన్నారు. అభివృద్ధి పనులకు సంబందించిన ఎస్టిమేట్స్ సిద్ధం చేయాలని సూచించారు.

News March 5, 2025

ఆదిలాబాద్ జిల్లాలో నేటి TOP NEWS

image

■ జిల్లా వ్యాప్తంగా ఇంటర్ వార్షిక పరీక్షలు ప్రారంభం
■ గాంధీ భవన్‌లో ఆదిలాబాద్ నాయకులతో సమీక్షా సమావేశం
■ ఆదిలాబాద్‌కు ఏయిర్ పోర్ట్ తీసుకొస్తా: ఎంపీ
■ జోగురామన్న వ్యాఖ్యలను ఖండించిన ఆదిలాబాద్ ఎమ్మెల్యే
■ మహారాష్ట్రలో యాక్సిడెంట్.. 16 మంది జిల్లా వాసులకు గాయాలు
■ BJPలో చేరిన సాత్నాల గ్రామస్థులు
■ పట్టభద్రుల ఎమ్మెల్సీగా అంజిరెడ్డి

error: Content is protected !!