News February 10, 2025
ఆదిలాబాద్‌లో నేటి పత్తి ధర వివరాలు
ఆదిలాబాద్ మార్కెట్ యార్డులో పత్తి కొనుగోళ్లు సజావుగా సాగుతున్నాయి. మార్కెట్‌లో సోమవారం క్వింటాల్ సీసీఐ పత్తి ధర రూ.7,421గా, ప్రైవేట్ పత్తి ధర రూ.6,910గా నిర్ణయించారు. శనివారం ధరతో పోలిస్తే సోమవారం సీసీఐ, ప్రైవేటు ధరల్లో ఎలాంటి మార్పులేదని వ్యవసాయ మార్కెట్ కమిటీ అధికారులు వెల్లడించారు.
Similar News
News February 11, 2025
ADB: ఎమ్మెల్సీ స్థానానికి నామినేషన్ వేసిన జర్నలిస్ట్
పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానానికి ఆదిలాబాద్‌కు చెందిన సీనియర్ జర్నలిస్ట్ పులగం దేవిదాస్ సోమవారం కరీంనగర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలను సమర్పించారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. పట్టభద్రులు, జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం పోటీ చేస్తున్నట్లు తెలిపారు. ఇదిలా ఉంటే జర్నలిస్టులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు.
News February 11, 2025
ADB: FEB 18న జిల్లా కబడ్డీ జట్ల ఎంపిక
ఆదిలాబాద్‌లోని ఇందిరా ప్రియదర్శిని స్టేడియంలో ఈ నెల 18న సబ్-జూనియర్ జిల్లా బాలబాలికల కబడ్డీ జట్ల ఎంపిక పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు రఘుపతి, రాష్ట్రపాల్ తెలిపారు. ఎంపికైన జిల్లా జట్టు వికారాబాద్ జిల్లాలోని 34వ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. అర్హులైన క్రీడాకారులు పాల్గొనాలని సూచించారు.
News February 11, 2025
ADB: ఆమెపైన చీటింగ్ కేసు నమోదు చేయండి: నవీన్
ఏక కాలంలో రెండు రెగ్యులర్ కోర్సులు కలిగి టీచర్ ఉద్యోగం పొందిన సౌజన్యపైన న్యాయ విచారణ జరిపించాలని ప్రజావాణికి తాంసి మండలానికి చెందిన అభ్యర్థి నవీన్ కుమార్ కోరారు. ఒక సాధారణ విద్యార్థిగా సుమారు 350 కి.మీ దూరంగా ఉన్న వేర్వేరు ప్రదేశాల్లో ఒకేసారి రెండు కోర్సులు చేయడం సాధ్యం కాదన్నారు. ఆమె తప్పుడు సర్టిఫికెట్ పెట్టి అధికారులను తప్పుదోవ పట్టించిందన్నారు. చీటింగ్ కేసు నమోదు చేయలన్నారు.