News June 7, 2024
ఆదిలాబాద్‌లో పోస్టుల వివరాలు ఇలా..!

ADB జిల్లాలో మొత్తం ఉపాధ్యాయ పోస్టులు 3,028 ఉండగా ప్రస్తుతం 2,467 మంది పని చేస్తున్నారు. మార్చి నుంచి ఇప్పటి వరకు 20 మంది పదవీవిరమణ పొందగా ఇందులో నలుగురు అనారోగ్య, రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో 561 ఖాళీలు ఉన్నాయి. ఇందులో 275 ఖాళీలను డీఎస్సీ నోటిఫికేషన్లో చూపించారు. ఆయా కేటగిరిల్లో 286 ఖాళీలు ఉన్నాయన్నమాట. తాజా డీఎస్సీలో చేర్చితే పోస్టులు పెరిగి నిరుద్యోగులకు మేలు జరిగే అవకాశముంది.
Similar News
News February 16, 2026
ADB: 25ఏళ్ల తర్వాత రెండో సారి

ఆదిలాబాద్ మున్సిపల్ ఛైర్‌పర్సన్‌గా స్వతంత్ర అభ్యర్థి అనూష బండారి ప్రమాణ స్వీకారం చేశారు. 2001లో స్వతంత్ర అభ్యర్థిగా గొడుగు గుర్తుపై లాలా రాధేశ్యాం పోటీ చేసి గెలుపొంది మున్సిపల్ ఛైర్మన్‌గా ప్రమాణ స్వీకారం చేశారు. సుమారు 25 ఏళ్ల తర్వాత మళ్లీ కుక్కర్ గుర్తుపై గెలుపొందిన స్వతంత్ర అభ్యర్థి అనూష ఛైర్‌పర్సన్‌గా ఎన్నికయ్యారు.
News February 16, 2026
ఆదిలాబాద్ బల్దియాలో అరుదైన దృశ్యం

ఆదిలాబాద్ మున్సిపాలిటీలో పక్కపక్క వార్డుల అభ్యర్థులే అత్యున్నత పదవులను కైవసం చేసుకోవడం విశేషం. చైర్‌పర్సన్‌గా 45వ వార్డు నుంచి గెలిచిన స్వతంత్ర అభ్యర్థి బండారి అనూష, వైస్ చైర్మన్‌గా 44వ వార్డు సభ్యుడు మహమ్మద్ రోహిత్ ఎన్నికయ్యారు. వరుస సంఖ్య గల వార్డులకే చైర్మన్, వైస్ చైర్మన్ పదవులు దక్కడంపై పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
News February 16, 2026
ఆదిలాబాద్ బల్దియాలో బీజేపీకి భంగపాటు

ఆదిలాబాద్‌లో కమలదళానికి గట్టి షాక్ తగిలింది. 21మంది కౌన్సిలర్లతో అతిపెద్ద పార్టీగా అవతరించినప్పటికీ, ఛైర్మన్ పీఠాన్ని దక్కించుకోవడంలో బీజేపీ విఫలమైంది. స్వతంత్ర అభ్యర్థుల మద్దతుపై గంపెడు ఆశలు పెట్టుకున్న నేతలకు, చివరి నిమిషంలో వారు హ్యాండ్ ఇవ్వడంతో పీఠం చేజారిపోయింది. స్వతంత్ర అభ్యర్థికి కాంగ్రెస్, బీఆర్ఎస్ సభ్యులు మద్దతు ప్రకటించడంతో సమీకరణాలు తలకిందులయ్యాయి.


