News April 8, 2025
ఆదిలాబాద్‌లో 12ఏళ్ల బాలికపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News April 8, 2025
ఇలా చేయడానికి సిగ్గుందా?: YS జగన్

AP: లింగమయ్య హత్య ఘటనలో 20 మందికి పైగా పాల్గొంటే, ఇద్దరిపైనే కేసులు పెడతారా? అని YS జగన్ ప్రశ్నించారు. ‘బేస్ బాల్ బ్యాట్, కత్తులు, కట్టెలతో దాడి చేశారు. బ్యాట్‌తో చేసిన దాడిలో లింగమయ్య చనిపోయారు. ఇది న్యాయమా? ధర్మమా అని సీఎం చంద్రబాబును ప్రశ్నిస్తున్నా. ఇలాంటి చర్యలకు చేయడానికి సిగ్గుందా? హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యే, ఆమె కొడుకుపై కేసులు పెట్టరా?ఉండవా?’ అని జగన్ ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.
News April 8, 2025
RCB కెప్టెన్‌కు జరిమానా

IPL: MIతో నిన్న జరిగిన మ్యాచ్‌లో స్లో ఓవర్ రేట్ కారణంగా RCB కెప్టెన్ రజత్ పాటీదార్‌కు బీసీసీఐ జరిమానా విధించింది. మొదటిసారి కావడంతో రూ.12 లక్షల ఫైన్ వేసింది. కాగా కెప్టెన్‌గా తొలి సీజన్‌లోనే రజత్ రాణిస్తున్నారు. నాలుగు మ్యాచ్‌ల్లో మూడు విజయాలు సాధించారు. మరోవైపు బ్యాటింగ్‌లోనూ అదరగొడుతున్నారు. అతడు జట్టును కూల్‌గా ముందుండి నడిపిస్తున్నారని తాజాగా గవాస్కర్ ప్రశంసించారు.
News April 8, 2025
షారుఖ్ మూవీలో తల్లి పాత్రలో దీపికా!

బాలీవుడ్ స్టార్ నటుడు షారుఖ్ ఖాన్, సిద్ధార్థ్ ఆనంద్ కాంబోలో తెరకెక్కనున్న యాక్షన్ థ్రిల్లర్ ‘కింగ్’లో దీపికా పదుకొణె అతిథి పాత్రలో నటిస్తున్నట్లు సమాచారం. ఈ చిత్రంలో ఆమె సుహానా ఖాన్ తల్లిగా, షారుఖ్ మాజీ ప్రేయసిగా కనిపించనున్నట్లు వార్తలొస్తున్నాయి. కథలో ప్రధాన సంఘర్షణలకు ఈ పాత్ర కేంద్రంగా ఉంటుందని తెలుస్తోంది. కాగా, ఇప్పటికే ఈ ముగ్గురి కాంబోలో వచ్చిన ‘పఠాన్’ రూ.1050 కోట్లు వసూలు చేసింది.