News April 8, 2025
ఆదిలాబాద్‌లో 12 ఏళ్ల అమ్మాయిపై అత్యాచారం

12ఏళ్ల బాలికపై అత్యాచారం జరిగిన ఘటన ఆదిలాబాద్‌లో వెలుగుచూసింది. DSP జీవన్ రెడ్డి తెలిపిన వివరాలు.. మావల పరిధిలోని ఓ కాలనీకి చెందిన బాలికను ఓ 35ఏళ్ల మహిళ ఆదివారం మధ్యాహ్నం అడవిలోకి తీసుకెళ్లింది. ఆమె బంధువుతో కలిసి అక్కడకు వచ్చిన ఇద్దరు యువకులు ఆమెపై అత్యాచారం చేశారు. బాలిక తల్లికి విషయం చెప్పడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువకులతో పాటు మహిళ, ఆమె బంధువుపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.
Similar News
News November 10, 2025
ఈ వారం థియేటర్/OTT అప్డేట్స్

* నవంబర్ 14: కాంత(దుల్కర్, భాగ్యశ్రీ, రానా)
* NOV 14: శివ రీరిలీజ్(నాగార్జున, అమల)
* NOV 14: సంతాన ప్రాప్తిరస్తు(విక్రాంత్, చాందిని)
* NOV 14: దే దే ప్యార్ దే 2(అజయ్ దేవగణ్, రకుల్, టబు)
* NOV 13: ఢిల్లీ క్రైమ్-3(నెట్‌ఫ్లిక్స్)
* NOV 14: డ్యూడ్(నెట్‌ఫ్లిక్స్)
* NOV 14: జాలీ ఎల్ఎల్‌బీ(జియో హాట్ స్టార్)
News November 10, 2025
నాగర్‌కర్నూల్ ఎస్పీ పేరుతో ఫేక్ ఇన్‌స్టా ఖాతా

నాగర్‌కర్నూల్ ఎస్పీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్ పేరుతో సైబర్ నేరగాళ్లు కొత్తగా నకిలీ ఇన్‌స్టాగ్రామ్ ఖాతా సృష్టించి డబ్బులు లాగే ప్రయత్నం చేస్తున్నారు. ఈ విషయాన్ని గమనించి ఎవరూ ప్రలోభాలకు గురికావద్దని ఎస్పీ స్వయంగా చెప్పారు. నకిలీ ఖాతా సృష్టించిన వారిపై కేసు నమోదు చేసి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు.
News November 10, 2025
పెరిమెనోపాజ్ గురించి తెలుసా?

నెలసరి ప్రక్రియలో మార్పులు తలెత్తటం, ఈస్ట్రోజెన్ ఉత్పత్తి తగ్గటం మొదలైనప్పటి నుంచీ నెలసరి నిలిచే ముందు దశ ప్రారంభమవుతుంది. దీన్నే పెరిమెనోపాజ్ అంటారు. అంటే మెనోపాజ్‌కు ముందుదశ. ఇది 40ల చివర్లో మొదలవుతుంది. ఈ సమయంలో నెలసరిలో మార్పులు, వేడిఆవిర్లు వస్తుంటాయి. మహిళలు పెరిమెనోపాజ్‌లో రెగ్యులర్‌గా వ్యాయామం చేయాలి. సమతుల ఆహారం తీసుకుంటూ ఒత్తిడి లేకుండా ఉండాలి. ఆల్కహాల్, ధూమపానం వంటివి మానేయాలి.


