News March 16, 2025

ఆదిలాబాద్‌లో AIRPORT.. AI PHOTO

image

ADBలో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటు ఉమ్మడి జిల్లా ప్రజల కల. ఆ కలను నెరవేర్చే బాధ్యత తనదని CM రేవంత్‌రెడ్డి శనివారం అసెంబ్లీలో హామీ ఇచ్చారు. వరంగల్ తర్వాత ADBకే ప్రాధాన్యం ఇస్తున్నామని ఆయన పేర్కొన్నారు. అయితే ఆదిలాబాద్‌లో ఎయిర్‌పోర్ట్ ఏర్పాటైతే ఉమ్మడిజిల్లా ప్రజలకు మేలు చేకూరనుంది. ఎయిపోర్ట్ ఏర్పాటైతే ఎలా ఉంటుందనే AI ఫొటోలు ఇప్పుడు ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్నాయి. ఫొటోను చూసి ఎలా ఉందో కామెంట్ చేయండి.

Similar News

News March 16, 2025

టీమ్‌ను మార్చినా ఓటమి తప్పలేదు

image

ఛాంపియన్స్ ట్రోఫీ తర్వాత కెప్టెన్‌ రిజ్వాన్, బాబర్ ఆజమ్‌తో సహా పలువురు ఆటగాళ్లను జట్టు నుంచి తప్పించిన పాకిస్థాన్‌కు ఆశించిన ఫలితం దక్కలేదు. NZతో తొలి టీ20లో ఆ జట్టు ఘోర పరాజయాన్ని చవిచూసింది. యువ ఆటగాళ్లు విఫలమవడంతో తొలుత బ్యాటింగ్ చేసిన పాక్ 91కి ఆలౌటైంది. న్యూజిలాండ్ 10.1 ఓవర్లలోనే ఒక వికెట్ నష్టపోయి టార్గెట్‌ను ఛేదించింది. NZ గడ్డపై పాక్‌కు ఇదే అత్యల్ప టీ20 స్కోర్.

News March 16, 2025

అనంత జిల్లాలో చికెన్ ధరలు

image

అనంతపురం జిల్లాలోని పలు ప్రాంతాలలో ఆదివారం చికెన్ ధరలు స్వల్పంగా పెరిగాయి. మటన్ ధరలు మాత్రం స్థిరంగా ఉన్నాయి. గుత్తిలో కేజీ మటన్ ధర రూ.750 పలుకుతోంది. అనంతపురంలో కేజీ చికెన్ ధర రూ.150 ఉండగా, గుత్తిలో కేజీ చికెన్ ధర రూ.170 నుంచి రూ.180కి కొంటున్నారు. గుంతకల్లులో కేజీ చికెన్ రూ.150 నుంచి రూ.160 ధర పలుకుతోంది. బర్డ్ ఫ్లూ కారణంగా గతవారం చికెన్ ధరలు తగ్గాయి.

News March 16, 2025

ఎ.ఆర్. రెహమాన్‌కు ఛాతి నొప్పి, ఆస్పత్రిలో చేరిక

image

ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ ఎ.ఆర్. రెహమాన్ ఆస్పత్రిలో చేరారు. అకస్మాత్తుగా ఛాతి నొప్పి రావడంతో చెన్నైలోని అపోలో ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. ఆయనను ఎమర్జెన్సీ వార్డులో చేర్చి చికిత్స అందిస్తున్నారు. వైద్యుల బృందం నిశితంగా పరిశీలిస్తోందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. దీనిపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది.

error: Content is protected !!