News April 14, 2024

ఆదిలాబాద్‌లో SUMMER CRICKET

image

క్రికెట్‌ ప్లేయర్లకు HYD క్రికెట్ అసోసియేషన్ శుభవార్త చెప్పింది. HCA ఆధ్వర్యంలో ఈ నెల 20న జిల్లాల వారిగా సమ్మర్ క్యాంప్‌ మొదలుపెడుతామని HCA ప్రెసిడెంట్ జగన్‌ మోహన్‌‌‌రావు తెలిపారు. ఉచితంగా‌నే ఈ క్యాంప్‌ కొనసాగిస్తామని‌ స్పష్టం చేశారు. రేపటి నుంచి రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. కేంద్రాల వివ‌రాలు:
ఆదిలాబాద్: 94402 07473
మంచిర్యాల: 94400 10696
సిర్పూర్: 94923 33333

Similar News

News April 22, 2025

ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

image

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.

News April 22, 2025

INTER RESULT: ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

image

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 9,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 4,967 మంది పాసయ్యారు. 54.55% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 8,890 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6,291 మంది పాసయ్యారు. 70.76% ఉతీర్ణత సాధించారు.

News April 22, 2025

ADB: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

image

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశపరీక్ష వచ్చే ఆదివారం ఏప్రిల్ 27న ఉంటుందన్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 వరకు, 7-10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు.

error: Content is protected !!