News June 24, 2024

ఆదిలాబాద్: అంగన్వాడీ టీచర్లకు 3రోజులు శిక్షణ తరగతులు

image

జాతీయ విద్యావిధానం 2020కి అనుగుణంగా నూతన పాఠ్య ప్రణాళికల్లో జరిగిన మార్పులపై ఆదిలాబాద్‌లో అంగన్వాడీ టీచర్లకు 3 రోజుల పాటు శిక్షణ తరగతులు ప్రారంభించారు. దీనికి ఐసీడీఎస్ సీడీపీఓ వనజ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. శిక్షణను సద్వినియోగం చేసుకొని విద్య వ్యవస్థ బలోపేతం కోసం కృషి చేయాలన్నారు. సూపర్వైజర్లు ఫర్హా, విజయలక్ష్మి, నీరజ, అంగన్వాడీ టీచర్లు పాల్గొన్నారు.

Similar News

News May 7, 2025

జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: ADB SP

image

ప్రస్తుత ఆధునిక సమాజంలో సైబర్ నేరగాళ్లు ప్రజలను మోసగిస్తున్న నేపథ్యంలో ఆదిలాబాద్ జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని SP అఖిల్ మహాజన్ సూచించారు. సైబర్ నేరం జరిగిన వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా cybercrime.gov.in వెబ్సైట్‌ను సంప్రదించాలని సూచించారు. వారం రోజులలో జిల్లాలో 13 ఫిర్యాదులు నమోదయినట్లు తెలిపారు. ఆన్‌లైన్ మనీ, గేమింగ్, బెట్టింగ్ చేయడం చట్ట విరుద్ధమన్నారు.

News May 7, 2025

ADB కలెక్టర్‌కు జడ్పీ మాజీ ఛైర్ పర్సన్ అభినందన

image

కలెక్టర్ రాజర్షి షాను కలెక్టరేట్‌లో జిల్లా పరిషత్ మాజీ ఛైర్ పర్సన్ సుహాసిని రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. ఆయన ప్రధాని మోదీ చేతుల మీదుగా ప్రతిష్ఠాత్మక ప్రధాన మంత్రి ప్రజాస్వామ్య పరిపాలన అవార్డు అందుకున్నందుకు అభినందించి పుష్పగుచ్ఛం అందజేశారు. ఆమెతో పాటు పలువురు నాయకులు ఉన్నారు.

News May 7, 2025

ఆదిలాబాద్ కలెక్టర్‌ను కలిసిన సాయి చైతన్య

image

యూపీఎస్సీ ఫలితాల్లో అఖిల భారత స్థాయిలో 68వ ర్యాంకు సాధించి ఐఏఎస్‌కు ఎంపికైన ఉట్నూర్‌కు చెందిన గిరిజన యువకుడు సాయి చైతన్య జాదవ్‌ శనివారం కలెక్టర్ రాజర్షి షాను ఆయన క్యాంప్ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా సాయి చైతన్యకు కలెక్టర్ జ్ఞాపిక అందజేసి శాలువాలతో సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం పలు విషయాలపై చర్చించారు. జిల్లా నుంచి ఐఏఎస్‌కు ఎంపిక కావడం పట్ల ఆయన హర్షం వ్యక్తం చేశారు.