News April 25, 2024

ఆదిలాబాద్: ‘అక్కడ సాయంత్రం 4 వరకే పోలింగ్’

image

పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక ప్రాంతాలపై ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సిర్పూర్, ఆసిఫాబాద్, ఆదిలాబాద్, చెన్నూరు, బెల్లంపల్లి, మంచిర్యాల, మంథని, భూపాలపల్లి, ములుగు, పినపాక, ఇల్లందు, భద్రాచలం, కొత్తగూడెం, అశ్వరావుపేట(ఖమ్మం)సెగ్మెంట్లలో ఉ.7 గంటల నుంచి సా.4 గంటల వరకే పోలింగ్ నిర్వహించాలని నిర్ణయించింది. మే 13న ఎన్నికల పోలింగ్ జరగనుంది.

Similar News

News February 21, 2026

రిమ్స్‌ ఎస్‌ఎన్‌సీయూ విభాగానికి జాతీయ పురస్కారం

image

ఆదిలాబాద్ రిమ్స్ ఆసుపత్రిలోని శిశు సంరక్షణ కేంద్రం జాతీయ స్థాయి గుర్తింపు పొందింది. పుదుచ్చేరిలోని జిప్మర్ సంస్థ నిర్వహించిన వర్క్‌షాప్‌లో ‘ఇన్ఫెక్షన్ కంట్రోల్ క్వాలిటీ ఇంప్రూవ్‌మెంట్’ ప్రాజెక్టుకు గానూ రిమ్స్ బృందం ప్రథమ బహుమతితో పాటు రూ. 5 వేల రివార్డు సాధించింది. ఈ ఘనత సాధించిన బృందాన్ని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అభినందించారు. రిమ్స్ వైద్యుల కృషి జిల్లాకు గర్వకారణమని ఆయన కొనియాడారు.

News February 21, 2026

పదో తరగతిలో ఉత్తమ ఫలితాలే లక్ష్యం: కలెక్టర్ రాజర్షి షా

image

పదో తరగతి విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించేలా తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని కలెక్టర్ రాజర్షి షా పిలుపునిచ్చారు. విద్యార్థుల తల్లిదండ్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి పరీక్షల సన్నద్ధతపై దిశానిర్దేశం చేశారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు పాఠశాలల్లో ఉదయం, సాయంత్రం ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నామని, విద్యార్థులు వీటిని సద్వినియోగం చేసుకునేలా చూడాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు.

News February 20, 2026

చైల్డ్ పోర్నోగ్రఫీ.. ఆదిలాబాద్ జిల్లాలో 5 కేసులు: ఎస్పీ

image

చైల్డ్ పోర్న్ వీడియోలు చూడటం, డౌన్‌లోడ్ చేయటం, సోషల్ మీడియాలో షేర్ చేయటం చట్టరీత్యా తీవ్రమైన నేరమని ఎస్పీ అఖిల్ మహాజన్ హెచ్చరించారు. ఇటువంటి చర్యలకు పాల్పడిన వారిపై కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లాలో ఇప్పటికే 5 కేసులు నమోదు అయ్యాయన్నారు. హైదరాబాద్ “చైల్డ్ టిప్ లైన్” పర్యవేక్షణ కొనసాగుతోందని పేర్కొన్నారు.