News December 6, 2025
ఆదిలాబాద్: అప్పు ఎంతైనా పర్వాలేదు.. గెలవాలంతే!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా ఈనెల 11, 14, 17వ తేదీల్లో ఎన్నికలు జరగనున్నాయి. పోలింగ్ తేదీలు దగ్గర పడుతున్న కొద్ది జిల్లాల్లో ఎన్నికల వేడి రాజుకుంటోంది. పలు పంచాయతీల్లో సర్పంచ్ అభ్యర్థులు గెలుపే లక్ష్యంగా కాసుల వేట కొనసాగిస్తున్నారు. ఎక్కువ అభ్యర్థులు పోటీ చేసే జనరల్ స్థానాల్లో ఈ ధోరణి తారస్థాయిలో ఉంది. కొంతమంది అభ్యర్థులు అయితే తమ వద్ద డబ్బులు లేక అప్పులు చేసి మరి ఖర్చు పెడుతున్నారు.
Similar News
News December 6, 2025
‘X’కు $140 మిలియన్ డాలర్ల ఫైన్

యూరోపియన్ యూనియన్ ‘X’ అధినేత ఎలాన్ మస్క్‌కు షాకిచ్చింది. తమ దేశంలోని ఆన్‌లైన్ కంటెంట్ రూల్స్‌ను మస్క్ ప్లాట్‌ఫామ్ ఉల్లంఘించిందని EU టెక్ రెగ్యులేటర్స్ ఆరోపించింది. అందుకు 120($140 మిలియన్స్) మిలియన్ యూరోస్ ఫైన్ విధించింది. దీనిని అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియో ఖండించారు. “ఇది కేవలం ‘X’ మీదే కాదు అమెరికా టెక్ ప్లాట్‌ఫామ్స్, US పౌరులపై విదేశీ ప్రభుత్వాల దాడి” అని ట్వీట్ చేశారు.
News December 6, 2025
KMR: బరిలో ఉండేదేవరో.. జారుకునేది ఎవరో..!

ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో 2వ విడత నామినేషన్ల ఉపసంహరణకు గడువు శనివారంతో ముగియనుంది. పలు మండలాల్లో వార్డు, సర్పంచి స్థానాలకు నామినేషన్లు దాఖలయ్యాయి. ప్రధాన పార్టీల మద్దతుదారులతో పాటు రెబల్స్, స్వతంత్ర అభ్యర్థులు బరిలో దిగారు. అసలు సిసలైన పోటీ ఎవరెవరి మధ్య ఉండబోతోందన్నది శనివారం సాయంత్రానికి తేటతెల్లం కానుంది. బరిలో నిలిచేది ఎవరో, తప్పుకునేది ఎవరో తెలియాలంటే శనివారం వరకు వేచి చూడాల్సిందే!
News December 6, 2025
నిర్మల్: తొలి విడతలో 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా తొలి విడత ఎలక్షన్స్ జరగనున్న ఆరు మండలాల్లో మొత్తం 16 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమైనట్లు అధికారులు ప్రకటించారు. మామడ 5, ఖానాపూర్ 5, పెంబి 4, దస్తురాబాద్, లక్ష్మణచందా మండలాల్లో 1 చొప్పున సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవమయ్యాయి. కడెంలో ఒక్క సర్పంచ్ స్థానం కూడా ఏకగ్రీవం కాలేదు.


