News April 12, 2024
ఆదిలాబాద్ అబ్బాయిల మనసు దోచేస్తున్న విదేశీ అమ్మాయిలు

వేర్వేరు దేశాలకు చెందిన యువతీ, యువకులు పెళ్లి బంధంతో ఒక్కటవుతున్నారు. విదేశీ అమ్మాయిలు ఏకంగా భారత యువకుల మనసులను దోచేస్తున్నారు. గుడిహత్నూర్ మండలం చింతగూడకు చెందిన రవికుమార్..మయన్మార్‌కు చెందిన జిన్ నెహూ థియేన్ అమ్మాయిని వివాహమాడారు. పాత బెల్లంపల్లికి చెందిన రాజు, లండన్‌కు చెందిన డయానాని పెళ్లి చేసుకున్నారు. ADBకు చెందిన అభినయ్ రెడ్డి.. అమెరికాకి చెందిన టేలర్ డయానె ప్రేమ పెళ్లి చేసుకున్నారు.
Similar News
News April 22, 2025
ADB: ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటిన ఆమీనా షిరీన్

ఆర్టీసీ కార్మికుడి కూతురు ఇంటర్ ఫలితాల్లో సత్తా చాటింది. ADB RTCలో రీజినల్ ఆన్లైన్ రిజర్వేషన్ ఇన్‌ఛార్జ్‌గా విధులు నిర్వహిస్తున్న సయ్యద్ అహమ్మద్ హుస్సేన్ కూతురు ఆమీనా షిరీన్ సెకండియర్‌లో 99శాతం ఉత్తీర్ణత సాధించింది. బైపీసీ విభాగంలో 1000కి 990 మార్కులు సాధించింది. ఆమెకు కుటుంబ సభ్యులు, ఆర్టీసీ సిబ్బంది అభినందనలు తెలిపారు. మన ADB అమ్మాయికి CONGRATULATIONS చెప్పేయండి మరి.
News April 22, 2025
INTER RESULT: ఆదిలాబాద్ జిల్లాలో ఎంతమంది పాసయ్యారంటే?

ఇంటర్ ఫలితాల్లో ఆదిలాబాద్ జిల్లా విద్యార్థులు సత్తా చాటారు. ఫస్ట్ ఇయర్‌లో 9,106 మంది విద్యార్థులు పరీక్షలు రాయంగా 4,967 మంది పాసయ్యారు. 54.55% మంది ఉతీర్ణత సాధించారు. సెకండియర్ ఇయర్‌లో 8,890 మంది విద్యార్థులు పరీక్ష రాయగా 6,291 మంది పాసయ్యారు. 70.76% ఉతీర్ణత సాధించారు.
News April 22, 2025
ADB: హాల్ టికెట్లు వచ్చేశాయ్..!

తెలంగాణ మోడల్ స్కూల్స్ ప్రవేశ పరీక్షల హాల్ టికెట్లు విడుదలయ్యాయని బోథ్ మోడల్ స్కూల్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ తెలిపారు. సంబంధిత వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయని విద్యార్థులను డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. ప్రవేశపరీక్ష వచ్చే ఆదివారం ఏప్రిల్ 27న ఉంటుందన్నారు. 6వ తరగతికి ఉదయం 10 నుంచి 12 వరకు, 7-10వ తరగతులకు మధ్యాహ్నం 2 నుంచి 4 వరకు ఉంటుందని పేర్కొన్నారు.