News December 26, 2025

ఆదిలాబాద్: అయోమయంలో స్వతంత్ర సర్పంచ్‌లు

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో GP ఎన్నికలు హోరాహోరీగా ముగిశాయి. ఈ నెల 22న సర్పంచ్‌లు, ఉపసర్పంచ్‌లు ప్రమాణస్వీకారం చేశారు. పార్టీల మద్దతుతో గెలిచిన వారు ఆయా పార్టీల ముఖ్య నేతలతో తమ సంబరాలు పంచుకుంటున్నారు. ఏ పార్టీ మద్దతు లేకుండా గెలిచిన స్వతంత్ర సర్పంచ్‌లు అయోమయంలో పడ్డారు. ఏ పార్టీలో చేరాలనేదీ తేల్చుకోలేకపోతున్నారు. కాంగ్రెస్, బీజేపీ, BRS పార్టీల్లో ఎటు వెళ్లితే అభివృధి చేసుకోవచ్చని ఆలోచిస్తున్నారు.

Similar News

News December 27, 2025

గంజాయి అక్రమ రవాణాపై KNR సీపీ స్పెషల్ ఫోకస్

image

కరీంనగర్ కమిషనరేట్లో 2025 సంవత్సరంలో నిషేధిత గంజాయిని అక్రమంగా తరలిస్తూ 6 కేసుల్లో 25 మంది నిందితులు పట్టుబడ్డారు. వీరి నుంచి 29.042kg గంజాయి, రూ.6,44,150, ఆరు మోటార్ సైకిల్స్, ఒక మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. మరోవైపు పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా కేసులు 9 నమోదు కాగా 12 మంది అరెస్టయ్యారు. రూ.5,81,280 విలువైన 334 క్వింటాళ్ల బియ్యంతో పాటు 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు.

News December 27, 2025

‘విద్యార్థుల్లో సామాజిక బాధ్యత పెంచేదే NSS’

image

విద్యార్థుల్లో సేవాభావం, సామాజిక బాధ్యతను పెంపొందించడంలో జాతీయ సేవా పథకం(NSS) కీలకమని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అన్నారు. భూంపల్లి హైస్కూల్‌లో దుబ్బాక ప్రభుత్వ డిగ్రీ కళాశాల విద్యార్థులు నిర్వహిస్తున్న NSS శిబిరాన్ని ఆయన సందర్శించారు. గ్రామంలో ప్లాస్టిక్ నిర్మూలన, వ్యర్థాల నిర్వహణపై విద్యార్థులు కల్పిస్తున్న అవగాహనను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

News December 27, 2025

నెల్లూరులో ఫేక్ ITCలతో రూ. 43 కోట్ల టోకరా !

image

నెల్లూరులో పెద్ద పెద్ద కంపెనీలు పన్నుల ఎగవేతకు కొత్త పంథాలను ఎంచుకుంటున్నట్లు తెలుస్తోంది. వాణిజ్య పన్నుల శాఖ జేసీ కిరణకుమార్ Way2Newsతో మాట్లాడుతూ.. నెల్లూరు డివిజన్ పరిధిలో రూ. 43 కోట్ల మేరా ఫేక్ ITC లను తీసుకున్నారని తెలిపారు. 8 సంస్థలపై కేసులు నమోదు చేశామని, ఇందులో ఐదుగురిపై కేసులు నమోదు చేయగా.. ముగ్గురు 10% డిమాండ్ కట్టి అప్పీల్ కి వెళ్లారని వివరించారు.