News July 5, 2025
ఆదిలాబాద్: ఆత్మహత్య పరిష్కారం కాదు!

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో ఆత్మహత్య ఘటనలు రోజురోజుకు పెరుగుతున్నాయి. చిన్న పిల్లల నుంచి మొదలుకొని పండు ముసలి వారు సూసైడ్ చేసుకుంటున్నారు. కారణం చిన్నదైన, పెద్దదైన ఆత్మహత్యే పరిష్కారమని భావిస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో శుక్రవారం వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. బజార్హత్నూర్‌కు చెందిన తరుణ్, లోకేశ్వరం వాసి దేవన్న, లింగాపూర్‌కు చెందిన సరసత్వీ పురుగు మందు తాగి బలవన్మరణానికి పాల్పడ్డారు.
Similar News
News July 5, 2025
ఈనెల 10న జిల్లా వ్యాప్తంగా మెగా పీటీఎం: కలెక్టర్

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, జూనియర్ కాలేజీలలో ఈనెల 10న మెగా పీటీఎం 2.0 కార్యక్రమం
నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను కర్నూలు కలెక్టర్ పి.రంజిత్ బాషా జిల్లా శనివారం ఆదేశించారు. తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల మధ్య సమన్వయం కోసమే పీటీఎం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. మెగా పీటీఎం 2.0 కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించాలని సూచించారు.
News July 5, 2025
విశాఖలో డ్రగ్స్ కలకలం.. ఐదుగురి అరెస్ట్

విశాఖలో శనివారం డ్రగ్స్ కలకలం రేపాయి. 25 గ్రాముల మత్తు పదార్థం కలిగి ఉన్న ఒక విదేశీయుడుతో పాటు మరో నలుగురిని త్రీటౌన్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మత్తు పదార్థాలు ఎక్కడి నుంచి తెస్తున్నారు, ఎవరికి విక్రయిస్తున్నారనే వివరాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News July 5, 2025
PNB కేసు.. నీరవ్ మోదీ సోదరుడు అరెస్ట్

వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీ సోదరుడు నేహాల్ మోదీని అమెరికా అధికారులు అరెస్ట్ చేశారు. భారత ప్రభుత్వ విజ్ఞప్తి మేరకు ఆయన్ను ఈనెల 4న అరెస్ట్ చేసినట్లు అక్కడి అధికారులు తెలిపారు. అతడిని భారత్‌కు అప్పగించే ప్రక్రియ మొదలైనట్లు సమాచారం. పంజాబ్ నేషనల్ బ్యాంకు(PNB)ను రూ.14వేల కోట్లకు మోసం చేసిన కేసులో నీరవ్ మోదీ నిందితుడిగా ఉన్న సంగతి తెలిసిందే. ఇదే కేసులో నేహాల్ అభియోగాలు ఎదుర్కొంటున్నారు.