News October 7, 2024
ఆదిలాబాద్: ఆరో విడత ద్వారా ITIలో అడ్మిషన్లు

ఆరో విడత ద్వారా ఐటీఐ కళాశాలలో ప్రవేశాలు పొందేందుకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఆదిలాబాద్ ITI కళాశాల ప్రిన్సిపాల్ రొడ్డ శ్రీనివాస్ పేర్కొన్నారు. అక్టోబర్ 5 నుంచి అక్టోబర్ 9 వరకు అవకాశం కల్పించినట్లు పేర్కొన్నారు. ఇప్పటికే నమోదు చేసుకున్న అభ్యర్థులు, తిరిగి నమోదు చేయనవసరం లేదని పేర్కొన్నారు. ఇంకా నమోదు చేయని అభ్యర్థులు ఐటీఐ పోర్టల్‌లో కొత్తగా నమోదు చేసుకుని, కళాశాలకు హాజరు కావాలని సూచించారు.
Similar News
News September 16, 2025
ఆదిలాబాద్: డిగ్రీ సెమిస్టర్ ఫలితాలు విడుదల

డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీ పరిధిలో డిగ్రీ ఫలితాలు విడుదలైనట్లు ఆదిలాబాద్ ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.జే సంగీత, వర్సిటీ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ జగ్రామ్ పేర్కొన్నారు. 2025 జూలై నెలలో రాసిన డిగ్రీ మొదటి సంవత్సరం రెండవ సెమిస్టర్ ఫలితాలు విడుదలైనట్లు పేర్కొన్నారు. ఫలితాల కోసం ఈ https://braou.ac.in/result#gsc.tab=0 వెబ్ సైట్‌ను సందర్శించాలని సూచించారు.
News September 16, 2025
ADB: వరద ప్రభావిత ప్రాంతాల్లో చర్యలు చేపట్టాలి: కలెక్టర్

జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాలకు తక్షణమే ఉపశమనం కల్పించాలని కలెక్టర్ రాజర్షి షా అధికారులను ఆదేశించారు. మంగళవారం క్యాంపు కార్యాలయం నుంచి మున్సిపాలిటీ, నీటిపారుదల శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. వరదలు ప్రభావితం చేసిన ప్రాంతాల్లో తాత్కాలిక, శాశ్వత పరిష్కారాల ద్వారా తక్షణమే చర్యలు తీసుకోవాలని దిశా నిర్దేశం చేశారు. లోతట్టు ప్రాంతాల్లో నీటి నిల్వ లేకుండా చూసేందుకు పనులు చేపట్టాలని సూచించారు.
News September 16, 2025
ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.