News August 1, 2024
ఆదిలాబాద్: ‘ఆ ఫోన్ కాల్స్ వస్తే నమ్మవద్దు’

సైబర్ మోసగాళ్లు కొత్త పంథా ఎంచుకున్నారని DSP జీవన్‌రెడ్డి తెలిపారు. కేటుగాళ్లు ప్రజలకు ఫోన్ చేసి మీ కుటుంబీకులు డ్రగ్స్‌తో పట్టుబడ్డారని వారిని విడిపించాలంటే డబ్బులు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారన్నారు. ఈరకమైన కాల్స్ పోలీస్, ఇతర అధికారులు చేస్తు మోసగాళ్లు బురిడి కొట్టిస్తున్నారని పేర్కొన్నారు. ఇలాంటి ఫేక్‌కాల్స్ వస్తే ప్రజలు నమ్మవద్దని కోరారు. ఇలాంటి కాల్స్ వస్తే వెంటనే నిర్ధారించుకోవాలన్నారు.
Similar News
News April 14, 2026
ఆదిలాబాద్: హెల్మెట్ తీర్మానం.. ఆదర్శంగా నిలిచిన జామిడి

99 రోజుల ప్రగతి ప్రణాళికలో భాగంగా ఆదిలాబాద్ జిల్లాకు వచ్చిన డీజీపీ శివధర్ రెడ్డికి జామిడి సర్పంచ్ ఈరగొల్ల అశోక్ వినూత్నమైన తీర్మానాన్ని అందజేశారు. గ్రామంలో ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరిస్తామని, ఇతర గ్రామాల వారు కూడా హెల్మెట్ ఉంటేనే తమ గ్రామంలోకి రావాలన్న నిర్ణయాన్ని ఎస్పీ అఖిల్ మహాజన్ సమక్షంలో వివరించారు. ఈ బాధ్యతాయుతమైన నిర్ణయాన్ని డీజీపీ అభినందించారు.
News April 13, 2026
ADB: మన ఇసుక – వాహనం’ పోర్టల్ పటిష్ఠ అమలుకు కలెక్టర్ ఆదేశం

ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకుండా, సమన్వయంతో పనిచేయాలని ఆదిలాబాద్ కలెక్టర్ రాజర్షిషా అధికారులను ఆదేశించారు. మన ఇసుక వాహనం పోర్టల్ పై అవగాహన, ఇతర అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఇసుక బుకింగ్, రవాణా ప్రక్రియలో ఎలాంటి జాప్యం జరగకూడదని, అధికారులు సమన్వయంతో పని చేయాలని స్పష్టం చేశారు. ఇసుక బుకింగ్ సమయంలో సరైన పత్రాలను అప్‌లోడ్ చేయడం తప్పనిసరని స్పష్టం చేశారు.
News April 13, 2026
ఆదిలాబాద్‌లో మెగా ఇండస్ట్రియల్ పార్క్

దేశంలోనే అతిపెద్ద పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఆదిలాబాద్ జిల్లాలో అడుగులు పడుతున్నాయి. విమానాశ్రయ నిర్మాణం ఖరారు కావడంతో సిమెంట్, ఫుడ్ ప్రాసెసింగ్, డిఫెన్స్ రంగాలకు అవకాశాలు పెరిగాయి. హైవే అనుసంధానం, చనాక-కోరాట నీటి వనరుల లభ్యత కలిసొచ్చే అంశాలు. బీంపూర్, జైనథ్, బోరజ్ మండలాల్లో సుమారు 2,000 ఎకరాల భూములను అధికారులు పరిశీలిస్తున్నారు. ఈ మెగా పార్కుతో జిల్లా పారిశ్రామిక రూపురేఖలు మారనున్నాయి.


