News October 30, 2025

ఆదిలాబాద్: ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ రీషెడ్యూల్

image

ఆదిలాబాద్ నుంచి గురువారం దయం 8 గంటలకు బయలుదేరాల్సిన ఆదిలాబాద్-నాందేడ్ ఇంటర్‌సిటీ ఎక్స్‌ప్రెస్ సమయాన్ని రైల్వే శాఖ రీషెడ్యూల్ చేసింది. ఈ రైలు ఉదయం 8 గంటలకు బదులుగా ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్ నుంచి బయలుదేరుతుంది. అలాగే, ఈ రైలు సేవలను ముద్ఖేడ్-నాందేడ్-ముద్ఖేడ్ మధ్య పాక్షికంగా రద్దు చేసినట్లు రైల్వే శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.

Similar News

News February 13, 2026

సిబ్బందికి శుభాకాంక్షలు: ఆదిలాబాద్ కలెక్టర్

image

జిల్లాలో మున్సిపల్ కౌంటింగ్ ప్రక్రియ ప్రశాంత వాతావరణంలో విజయవంతంగా ముగిసినట్లు జిల్లా కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. కౌంటింగ్ విధుల్లో పాల్గొన్న సిబ్బంది క్రమశిక్షణతో, అంకితభావంతో పనిచేసి మొత్తం ప్రక్రియను సాఫీగా పూర్తి చేశారని ఆయన అభినందించారు. మద్దతు అందించిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలియజేశారు. కౌంటింగ్‌లో పాల్గొన్న సిబ్బంది, భద్రతా సిబ్బంది, సంబంధిత అధికారులందరికీ శుభాకాంక్షలు తెలిపారు.

News February 13, 2026

విజయోత్సవ ర్యాలీలు నిర్వహిస్తే చర్యలు తప్పవు: ADB DSP

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఫలితాల వేళ డీఎస్పీ జీవన్ రెడ్డి ఆంక్షలు విధించారు. అనుమతి లేకుండా విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం, టపాకాయలు పేల్చడం నిషేధమని హెచ్చరించారు. కౌంటింగ్ కేంద్రం, ప్రధాన చౌరస్తాల వద్ద 144 సెక్షన్ అమలులో ఉంటుందని.. ప్రజలు గుమిగూడరాదని స్పష్టం చేశారు. ఎవరైనా చట్టాన్ని ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేస్తామని, పోలీసులకు సహకరించాలని కోరారు.

News February 13, 2026

ఆదిలాబాద్‌లో తొలి విజయం మహిళదే

image

ఆదిలాబాద్ మున్సిపల్ ఎన్నికల కౌంటింగ్ నేపథ్యంలో మొదటి ఫలితం వెలువడింది. 48 వార్డులో బీజేపీ అభ్యర్థి ఆకుల రేణుక ప్రవీణ్ విజయం సాధించారు. తమ సమీప ఏఐఎఫ్‌బీ పార్టీ అభ్యర్థి రంగినేని మనీషాపై 34 ఓట్లతో విజయం సాధించారు. కౌంటింగ్ ప్రక్రియ ఉత్కంఠ భరితంగా సాగింది. మిగిలిన వార్డుల్లో ఫలితాలు వెలువడాల్సి ఉన్న నేపథ్యంలో ఎక్కడ చూసినా టెన్షన్ వాతావరణం నెలకొంది.