News April 25, 2024
ఆదిలాబాద్: ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీ

ఈ నెల 25 నుంచి ఓటర్ స్లిప్పుల పంపిణీకి చర్యలు తీసుకుంటున్నట్లు రిటర్నింగ్ అధికారి రాజర్షి షా తెలిపారు. మంగళవారం అధికారులతో టెలి కాన్ఫరెన్స్ నిర్వహించి పంపిణీకి ఏర్పాట్లను సిద్ధం చేయాలని ఆదేశించారు. అందరికి ఓటర్ స్లిప్ ఇవ్వడంతో పాటు ఓటర్ గైడ్‌ను కూడా అందించాలన్నారు. గ్రామాలు, మున్సిపాలిటీల్లో బూత్ స్థాయి అధికారులు ఓటర్ స్లిప్పులు పంపిణీలో నిర్లక్ష్యం వహించకూడదన్నారు.
Similar News
News November 9, 2025
ఆదిలాబాద్: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఇవే

మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, నార్నూర్ ప్రాంతాల్లో ప్రారంభించనున్నట్లు కలెక్టర్ రాజర్షి షా తెలిపారు. సోయాబీన్ కొనుగోలు కేంద్రాలు ఆదిలాబాద్, జైనాథ్, బేల, భీంపూర్, ఇచ్చోడ, నేరడిగొండ, బోథ్, ఇంద్రవెల్లి, ఉట్నూర్, నార్నూర్ ప్రాంతాల్లో ఏర్పాటు చేసినట్లు కలెక్టర్ చెప్పారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు.
News November 9, 2025
మొక్కజొన్న, సోయాబీన్‌కు మద్దతు ధరతో కొనుగోలు: ADB కలెక్టర్

ఆదిలాబాద్ జిల్లా రైతుల కోసం మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో మొక్కజొన్న, సోయాబీన్ పంటలను మద్దతు ధరతో కొనుగోలు చేస్తున్నట్లు కలెక్టర్ రాజార్షి షా తెలిపారు. జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. నాణ్యతా ప్రమాణాలను మించిన పంటను కొనుగోలు చేయబడదని స్పష్టం చేశారు. కొనుగోలు కేంద్రాల వివరాలు, సందేహాల కోసం రైతులు 6300001597ను సంప్రదించాలన్నారు.
News November 9, 2025
రాష్ట్రస్థాయి పోటీలో ఫైనల్‌కు ADB జట్టు

నారాయణపేటలో జరుగుతున్న ఎస్జీఎఫ్ రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ అండర్-17 బాలికల విభాగంలో ఆదిలాబాద్ జిల్లా జట్టు ఫైనల్‌కు చేరింది. సెమి ఫైనల్ మ్యాచ్‌లో కరీంనగర్ జట్టుపై ఆదిలాబాద్ జట్టు విజయం సాధించింది. ఇప్పటివరకు జరిగిన అన్ని మ్యాచ్‌లలో జిల్లా జట్టు అద్భుత ప్రదర్శన కనబరుస్తూ.. ఘన విజయాలను నమోదు చేసినట్లు జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరీ రామేశ్వర్ తెలిపారు. జిల్లా జట్టుకు DEO రాజేశ్వర్ అభినందనలు తెలిపారు.


