News October 2, 2024

ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా ఇలంబరితి

image

ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా స్పెషల్ ఆఫీసర్‌గా రవాణా శాఖ కమిషనర్ ఇలంబరితిని నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి శాంతి కుమారి ఉత్తర్వులు జారీ చేశారు. ఆదిలాబాద్, నిర్మల్, కొమరం భీమ్, మంచిర్యాల జిల్లాలకు స్పెషల్ ఆఫీసర్‌గా ఆయన్ను నియమించారు. జిల్లాల్లో పర్యటించడంతో పాటు కలెక్టర్లతో సమన్వయం చేసుకుంటూ ప్రభుత్వ ప్రాధాన్యత పథకాల అమలును పర్యవేక్షించాలని ఆదేశించారు.

Similar News

News December 31, 2025

సాయిద సిబ్బందికి క్రమశిక్షణ తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

image

సాయుధ పోలీసు సిబ్బంది క్రమశిక్షణతో పాటు నిజాయితీని కలిగి ఉండాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. వార్షిక తనిఖీల్లో భాగంగా బుధవారం ఆయన జిల్లా పోలీసు సాయుధ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. సిబ్బంది గౌరవ వందనాన్ని స్వీకరించి, వారి పనితీరును అడిగి తెలుసుకున్నారు. సిబ్బంది కిట్లను, కార్యాలయ రికార్డులను పరిశీలించి, వాటిని ఎప్పటికప్పుడు నవీకరించాలని ఆదేశించారు. విధుల్లో అప్రమత్తంగా ఉండాలన్నారు.

News December 31, 2025

నూతన సంవత్సరం COME WITH BOOK: కలెక్టర్

image

జిల్లా ప్రజలందరికీ కలెక్టర్ రాజార్షిషా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి తనను కలవడానికి వచ్చే సందర్శకులకు జిల్లా యంత్రాంగం తరఫున ఒక వినూత్నమైన, సామాజిక బాధ్యతతో కూడిన విజ్ఞప్తి చేశారు. COME WITH BOOK అనే నినాదంతో, నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేయడానికి వచ్చే వారు పిల్లల సాహిత్య పుస్తకాలను తీసుకువచ్చి పాఠశాల గ్రంథాలయాలకు విరాళంగా అందించాలన్నారు.

News December 31, 2025

బోథ్: పూణేలో ఆర్మీ జవాన్ మృతి

image

బోథ్ మండలంలోని మర్లపల్లి గ్రామానికి చెందిన జవాన్ కాసర్ల వెంకటేశ్(30) పూణేలో జరిగిన రైలు ప్రమాదంలో దుర్మరణం పాలయ్యారు. జవాన్ ప్రమాదవశాత్తు రైలు నుంచి జారి పడ్డారా లేక మరేదైనా జరిగిందా అనే విషయాలు తెలియాల్సి ఉంది. మృతునికి భార్య, కుమారుడు, తల్లి, సోదరుడు ఉన్నారు. జవాన్ మరణవార్తతో మర్లపల్లిలో విషాద ఛాయలు అలముకున్నాయి. మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చేందుకు ఆయన స్నేహితులు పూణేకు బయలుదేరారు.