News July 31, 2024
ఆదిలాబాద్: ఎడ్యుకేషన్ స్పెషల్ NEWS మీకోసమే..!

★ ఆదిలాబాద్ జిల్లాలోని KGBVలో 13 నాన్ టీచింగ్ పోస్టులు.. AUG 1లోపు దరఖాస్తులు
★ అంబెడ్కర్ యూనివర్సిటీలో డిగ్రీ, పీజీ అడ్మిషన్లు.. AUG 18 LAST
★ AUG 1 నుండి DEECET సర్టిఫికెట్ వెరీఫికేషన్
★ పీజీ అసైన్మెంట్ సబ్మిషన్ కు నేడే LAST
★ నేడు పాలిసెట్ సీట్ల కేటాయింపు
★ RIMSలో వైద్య పోస్టుల భర్తీ.. AUG 6న ఇంటర్వ్యూ
★ ఆర్థికసహాయంకై.. ట్రాన్స్ జెండర్ ల నుండి దరఖాస్తులు
★ DOST రిజిస్ట్రేషన్ AUG 2న లాస్ట్
Similar News
News November 9, 2025
ADB: రద్దీ దృష్ట్యా పలు రైళ్లకు అదనపు కోచ్‌లు

ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకొని పలు రైళ్లకు అదనపు కోచ్‌లు అందుబాటులోకి తెచ్చినట్లు డివిజన్ ప్రజా సంబంధాల అధికారి రాజేష్ షిండే తెలిపారు. నాందేడ్- మన్మాడ్- నాందేడ్ ప్యాసింజర్, పూర్ణ- ఆదిలాబాద్ రైళ్లకు ఆదివారం నుంచి అదనపు కోచ్‌లు ఉంటాయి. ఆదిలాబాద్- పర్లి ప్యాసింజర్, వైజ్నాథ్- అకోలాకు ఈ నెల 10 నుంచి, అకోలా-పూర్ణ, పర్లివైజ్నాథ్- పూర్ణ రైళ్లకు ఈ నెల 11 నుంచి కోచ్‌లు అందుబాటులోకి వస్తాయన్నారు.
News November 8, 2025
తాంసి పోలీస్ స్టేషన్ తనిఖీ చేసిన SP

వార్షిక తనిఖీల్లో భాగంగా ఎస్పీ అఖిల్ మహాజన్ శనివారం తాంసి పోలీస్ స్టేషన్‌ను సందర్శించారు. స్టేషన్ నిర్వహణ, సిబ్బంది పనితీరును పరిశీలించారు. బాధితుల పట్ల గౌరవంగా వ్యవహరిస్తూ, ఫిర్యాదుదారుల సమస్యలను త్వరగా పరిష్కరించే విధంగా పనిచేయాలని సిబ్బందికి సూచించారు. పోలీసు గౌరవ ప్రతిష్టలు పెంచేలా విధులు నిర్వహించాలన్నారు. నేరస్తుల పట్ల కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.
News November 8, 2025
గిరిజన భాషల ఉత్సవాలకు ఉట్నూర్ వాసి

జాతీయస్థాయి గిరిజన భాషల ఉత్సవాలు ఈనెల 11, 12న న్యూఢిల్లీలో జరగనున్నాయి. నేషనల్ ట్రైబల్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూషన్ ఆధ్వర్యంలో జరిగే కార్యక్రమానికి ఉట్నూర్‌కు చెందిన బంజారా రచయితా డా.ఇందల్ సింగ్‌ను ఆహ్వానించారు. జాతీయ స్థాయిలో జరిగే కార్యక్రమంలో గిరిజన భాషల ఔన్నత్యాన్ని తెలిపే అవకాశం లభించడం సంతోషంగా ఉందని ఆయన పేర్కొన్నారు.


