News March 13, 2026
ఆదిలాబాద్ ఎయిర్‌పోర్టుపై వీడని ఉత్కంఠ

ADB విమానాశ్రయ భూసేకరణ వ్యవహారం గందరగోళంగా మారింది. బ్లూప్రింట్ సిద్ధమైందని నేతలు చెబుతుండగా, తమకు ఎలాంటి ఆదేశాలు రాలేదని కలెక్టర్ స్పష్టం చేయడం చర్చనీయాంశమైంది. రన్‌వే విస్తరణకు 249.81 ఎకరాలు అవసరం కానుంది. దీంతో భూములు ఎటువైపు పోతాయో తెలియక ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రకటనతో బాధితుల్లో భయం పెరిగింది. స్పష్టత ఇవ్వాలని ప్రజలు కలెక్టరేట్ వద్ద నిరసన చేపట్టారు.
Similar News
News April 13, 2026
ఆదిలాబాద్: ముగిసిన పది పరీక్షలు

ఆదిలాబాద్‌లో పదో తరగతి పరీక్షల ప్రశాంత వాతావరణంలో ముగిశాయి. మార్చి 14న ప్రారంభమైన పరీక్షలు నేటి వరకు కొనసాగాయి. ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు పోలీసుల బందోబస్తు నడుమ పకడ్బందీగా నిర్వహించారు. ఒక్కో పరీక్షకు 4 నుంచి 6 రోజుల గ్యాప్ ఇవ్వడంతో నెలరోజులపాటుగా పరీక్షలు కొనసాగాయి. సోమవారం చివరి పరీక్షకు 10,889 మంది విద్యార్థులకు గాను 10,868 విద్యార్థులు హాజరై 21 మంది గైరాజయ్యారు.
News April 13, 2026
ఆదిలాబాద్: ఇంటర్ ఫలితాలపై అధికారుల ఆరా..!

ఆదిలాబాద్ జిల్లా ఇంటర్ ఫలితాల్లో తీవ్రంగా వెనుకబడింది. మొదటి సంవత్సరంలో 32వ ర్యాంకు (50.77%), ద్వితీయ సంవత్సరంలో 33వ ర్యాంకు (62.50%) సాధించింది. ప్రత్యేక తరగతులు నిర్వహించినా ఫలితం లేకపోవడంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ముఖ్యంగా బాలుర ఉత్తీర్ణత తగ్గడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. మారుమూల ప్రాంతాల్లో పర్యవేక్షణ లోపం, విద్యార్థుల గైర్హాజరు వల్లే ఈ పరిస్థితి తలెత్తిందని భావిస్తున్నారు.
News April 12, 2026
ఇంటర్ సెకండియర్ ఫలితాలు.. ADBకు 33వ ర్యాంకు

ఇంటర్ సెకండియర్ ఇయర్ ఫలితాలు విడుదలయ్యాయి. ఆదిలాబాద్(D)లో రెగ్యులర్ విద్యార్థులు 7,518 మంది పరీక్షలు రాయగా 4,699 మంది పాసై 62.50% ఉత్తీర్ణతతో 33వ స్థానంలో నిలిచింది. ఇక రెగ్యులర్ ఒకేషనల్‌లో 905 మందికి 669 మంది పాసై73.95 శాతంతో 18వ స్థానంలో నిలవగా రెగ్యులర్ ప్రైవేట్‌లో 452 మందికి 162 మంది పాసై 35.84%తో 8వ స్థానంలో నిలిచింది. ఒకేషనల్ ప్రైవేట్‌లో 53 మందికి 15 మంది పాసై 28.30%తో 34వ ప్లేస్ వచ్చింది.


