News October 28, 2025
ఆదిలాబాద్: ‘ఎల్లుండి స్కూళ్లు, కాలేజీలు బంద్’

ఈనెల 30న రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో జరిగే విద్యాసంస్థల బంద్‌ను విజయవంతం చేయాలని ఎస్ఎఫ్ఐ ఆదిలాబాద్ జిల్లా కార్యదర్శి గణేశ్ పిలుపునిచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం రెండేళ్ల నుంచి పెండింగ్‌లో పెట్టిన స్కాలర్‌షిప్‌లు, ఫీజు రియంబర్స్‌మెంట్‌ను విడుదల చేయకుండా పేద విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటోందన్నారు. దీపావళిలోపు రూ.1,200 కోట్లు చెల్లిస్తామని హామీ ఇచ్చి అమలు చేయలేదని ఆరోపించారు.
Similar News
News October 29, 2025
ఆలయంలో దైవ దర్శనం ఎలా చేసుకోవాలి?

ఆలయానికి వెళ్తే ముందుగా ధ్వజస్తంభానికి నమస్కరించాలి. గర్భాలయంలో దేవుణ్ని మొక్కేటప్పుడు విగ్రహానికి ఎదురుగా నిలబడకూడదు. దేవుని దృష్టికి అడ్డు రాకుండా పక్కకు జరిగి దర్శించుకోవాలి. కళ్లు మూయకుండా.. తెరిచే భగవంతున్ని దర్శించుకోవాలి. ఆయన దివ్య స్వరూపాన్ని, తేజస్సును మనసులో పదిలం చేసుకోవాలి. మన దృష్టిని భగవంతునిపై నిలిపి, అనుగ్రహాన్ని పొందాలి. దర్శనం తర్వాత ప్రశాంతంగా ప్రదక్షిణలు చేయాలి.
News October 29, 2025
క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి కొనుగోళ్లు

సెప్టెంబర్‌లో క్రెడిట్ కార్డులతో రికార్డు స్థాయి (₹2.17 లక్షల కోట్లు) కొనుగోళ్లు జరిగాయి. ఆగస్టుతో పోలిస్తే ఇది 14% అధికం. ఫెస్టివల్ సీజన్, బ్యాంకులు, ఇ-కామర్స్ ప్లాట్‌ఫామ్‌ల డిస్కౌంట్లు, ఆఫర్లతో పాటు GST రేట్లలో కోత ఇందుకు కారణాలుగా మార్కెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. 2025 మార్చిలో ₹2.015 ట్రిలియన్, ఆగస్టులో ₹1.91T కొనుగోళ్లు నమోదయ్యాయి. గత ఏడాది సెప్టెంబర్‌లో ఇది ₹1.76లక్షల కోట్లుగా ఉంది.
News October 29, 2025
సంగారెడ్డి: కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు

సంగారెడ్డిలోని ట్రైబల్ వెల్ఫేర్ లా గురుకుల కళాశాలలో ఐదు సంవత్సరల కోర్సుకు స్పాట్ అడ్మిషన్లు ఈనెల 29వ తేదీన నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాస్ యాదవ్ మంగళవారం తెలిపారు. ఎస్టీ-35 బీసీ-1 ఓసీ-2 సీట్లు ఉన్నాయని చెప్పారు. ఇంటర్ చదివి లా సెట్ అర్హత సాధించిన విద్యార్థులు మాత్రమే అర్హులని పేర్కొన్నారు. ఒరిజినల్ సర్టిఫికెట్లతో ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు.


