News November 1, 2025
ఆదిలాబాద్: ఓపెన్ ఫలితాలు విడుదల

TOSS ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షా ఫలితాలు విడుదలైనట్లు DEO ఖుష్బూ గుప్తా, ఓపెన్ స్కూల్ ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్ అశోక్ తెలిపారు. సెప్టెంబర్ 22 – 28వరకు జరిగిన పరీక్షల ఫలితాలు https://www.telanganaopenschool.org/ వెబ్ సైట్‌లో పొందుపర్చినట్లు పేర్కొన్నారు. మెమోల్లో పొరపాట్లుంటే ఈ నెల 14వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పదో తరగతి రీకౌంటింగ్ కోసం పేపర్ కు రూ.350, ఇంటర్‌కు రూ.400 చెల్లించాలన్నారు.
Similar News
News November 1, 2025
టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలి: సంజయ్

TG: ఆరు రాష్ట్రాల్లో వేర్వేరుగా అమలవుతున్న టెన్త్, ఇంటర్ బోర్డులను విలీనం చేయాలని కేంద్ర పాఠశాల విద్యాశాఖ కార్యదర్శి సంజయ్ కుమార్ కోరారు. HYDలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. AP, TG, కేరళ, WB, ఒడిశా, మణిపుర్‌లో పది, ఇంటర్‌లకు వేర్వేరు బోర్డులున్నాయని, వీటితో గందరగోళం ఏర్పడుతోందన్నారు. CBSE, ICSE బోర్డుల నుంచి అధిక సంఖ్యలో విద్యార్థులు జాతీయ పరీక్షల్లో అర్హత సాధిస్తున్నారని గుర్తు చేశారు.
News November 1, 2025
కరీంనగర్: కవిత ‘జనం బాట.. అందుకేనా..?’

MLC కవిత జనం బాటతో జిల్లాల్లో పర్యటిస్తూ పార్టీ పెట్టేందుకు బాటలు వేసుకుంటున్నారు. క్షేత్రస్థాయిలో తన బలాబలాలను తెలుసుకునే ప్రయత్నంలో భాగంగా కరీంనగర్‌లో ఆమె పర్యటన సాగుతోంది. మేధావులను, రైతులను, కుల సంఘాలను, విద్యావంతులను కలుస్తూ తాను ఎత్తుకున్న BCనినాదంపై ఫీడ్ బ్యాక్ తెలుసుకుంటున్నారు. జిల్లాల పర్యటన తర్వాత సాధ్యాసాధ్యాలను పరిశీలించి పార్టీ పెట్టాలా? వద్దా? అనే నిర్ణయానికి ఆమె వచ్చే ఛాన్స్ ఉంది.
News November 1, 2025
చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారు!

జిల్లాలో చేప పిల్లల పంపిణీకి ముహూర్తం ఖరారైంది. జిల్లాకు 5.98 కోట్ల చేప పిల్లలు కావాలని మత్స్యశాఖ అధికారులు ఇప్పటికే ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. ఈనెల రెండో తేదీన నకిరేకల్ పట్టణంలోని పెద్ద చెరువులో చేప పిల్లల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించనున్నారు. జిల్లాలో సుమారుగా 60 వేల మంది మత్స్య కార్మికులకు ఉచిత చేప పిల్లల పంపిణీ ద్వారా లబ్ధి చేకూరనుంది.


