News October 7, 2025
ఆదిలాబాద్: ‘కొమురం భీం ఆశయ సాధనకు కృషి’

ఆదివాసీ యోధుడు కొమురం భీం వర్ధంతి సందర్భంగా మంగళవారం ఆదిలాబాద్‌లోని ఆయన విగ్రహానికి నివాళులర్పించారు. కలెక్టర్ రాజర్షి షా, ఎస్పీ అఖిల్ మహాజన్ భీం విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవించారు. కొమురం భీం సేవలు, పోరాట స్ఫూర్తిని వారు స్మరించుకున్నారు. కొమురం భీం ఆశయ సాధనకు కృషి చేయాలని కలెక్టర్, ఎస్పీ పేర్కొన్నారు.
Similar News
News October 7, 2025
ఆదిలాబాద్ కలెక్టరేట్‌లోవాల్మీకీ జయంతి

ఆదిలాబాద్ కలెక్టరేట్‌లో బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో వాల్మీకీ జయంతిని ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ రాజర్షి షా వాల్మీకీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రపంచం ఉన్నంత వరకు రామాయణ, వాల్మీకి చరిత్ర ఉంటుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ అఖిల్ మహాజన్, అదనపు కలెక్టర్ శ్యామలాదేవి, రాజేశ్వర్, సబ్ కలెక్టర్ యువరాజ్, ASP కాజల్, బీసీ శాఖ అధికారి రాజలింగు పాల్గొన్నారు.
News October 7, 2025
ఆదిలాబాద్: కాంట్రాక్ట్ పద్ధతిన ఉద్యోగాలు

డా.బీఆర్ అంబేడ్కర్ వర్సిటీ అధ్యయన కేంద్రంలో కాంట్రాక్ట్ పద్ధతిన కౌన్సలింగ్ తరగతులు బోధించడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రభుత్వ సైన్స్ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డా.సంగీత పేర్కొన్నారు. బోధన అనుభవం, PHD, నెట్, సెట్, పీజీ సంబంధిత సబ్జెక్టులలో 55% మార్కులు కలిగి ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అర్హులు www.braou.ac.inలో అక్టోబర్ 10లోపు రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు.
News October 7, 2025
ADB: రేపే తీర్పు.. రిజర్వేషన్లు మారుతాయా?

స్థానిక సంస్థల ఎన్నికల రిజర్వేషన్లకు సంబంధించి హైకోర్టు తీర్పుపై అంతటా ఆసక్తి నెలకొంది. రిజర్వేషన్లు మారితే తాము బరిలో నిలువచ్చని కొందరు, తమ అవకాశం పోతుందని కొందరు తీర్పు పైనే భారం వేశారు. అయితే
కొన్ని గ్రామాల్లో లేని కేటగిరీ వారికి రిజర్వేషన్లు వచ్చాయి. పీచర, సావర్గాం, ఆరెపల్లి, దస్తూరాబాద్(మండలం) వంటి గ్రామాల్లో అసలు బీసీలు లేరని, రిజర్వేషన్లు మార్చాలని ఆయా గ్రామాలవాసులు కోరుతున్నారు.