News October 17, 2024

ఆదిలాబాద్: కొమురం భీమ్‌కు KTR నివాళి

image

ఆదివాసీ యోధుడు.. అరణ్య సూర్యుడు.! పోరాటాల పోతుగడ్డ మీద పుట్టిన అడవి తల్లి ముద్దుబిడ్డ కొమురం భీం అని మాజీ మంత్రి KTR (X) వేదికగా పేర్కొన్నారు. దేశం గర్వించదగ్గ గిరిజన తిరుగుబాటు వీరుడు.. గోండు బెబ్బులి.. కొమురం భీమ్‌ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఉద్యమ బాటలో.. ఉజ్వల ప్రగతి దారిలో జల్.. జంగల్.. జమీన్ నినాదమే స్ఫూర్తిగా కొమురం భీం ఆశయాల అడుగు జాడల్లో పయనించామన్నారు.

Similar News

News July 10, 2025

ADB అదనపు కలెక్టర్‌కు ఐద్వా సర్వే రిపోర్ట్

image

అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) ఆధ్వర్యంలో జిల్లాలో నెలకొన్న సమస్యలపై వారం రోజులుగా సర్వే నిర్వహించారు. గురువారం సర్వే రిపోర్టును ఆదిలాబాద్ అదనపు కలెక్టర్ శ్యామలాదేవికి అందజేశారు. ప్రభుత్వ ఆస్పత్రుల్లో, పాఠశాలల్లో, రిమ్స్‌లో మౌలిక వసతులు కల్పించాలన్నారు. బెల్ట్ షాపులను తొలగించాలని, కల్తీ కల్లును అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. నాయకులు మంజుల, జమున తదితరులున్నారు.

News July 10, 2025

సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలన: ADB SP

image

బాలలు బడులకు వెళ్లే విధంగా ప్రోత్సహించాలని, పిల్లలు కార్మికులుగా ఉండరాదని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. ఆపరేషన్ ముస్కాన్‌పై వివిధ శాఖల అధికారులతో ఆదిలాబాద్‌లో సమావేశం నిర్వహించారు. ఆపరేషన్ ముస్కాన్ ప్రారంభమైన పది రోజుల వ్యవధిలో 37 మంది బాలల సంరక్షణ తోపాటు జిల్లావ్యాప్తంగా 10 కేసుల నమోదు చేసినట్లు పేర్కొన్నారు. అందరి సమష్టి కృషితో బాలకార్మిక వ్యవస్థను నిర్మూలిద్దామని పిలుపునిచ్చారు.

News July 10, 2025

ADB: ఆవు మృతితో ఆ ఊరంతా కన్నీళ్లు

image

బజార్హత్నూర్ మండల కేంద్రంలోని శివాలయానికి చెందిన ఆవు మృతి చెందింది. 20 ఏళ్ల క్రితం సబ్బిడి పుష్పలత, నందు కుమార్ కుటుంబ సభ్యులు ఆలయానికి అవును విరాళంగా అందించగా, 16 దూడెలకు జన్మనిచ్చింది. రెండు దశాబ్దాలుగా ఆలయంలో దూప, దీప, నైవేద్యాలకు ఆదాయాన్ని సమకూర్చిన ఆవు కన్నుమూయడంతో గ్రామంలో విషాదం నెలకొంది. గ్రామస్థులంతా కలిసి డప్పు వాయిద్యాలతో అంత్యక్రియలు నిర్వహించారు.