News June 24, 2024

ఆదిలాబాద్: గుర్తుపడితే సమాచారం ఇవ్వండి

image

ఇటీవల రెండు చోట్ల చైన్ స్నాచింగ్ కు పాల్పడ్డ నిందితుల ఫొటోను పోలీసులు విడుదల చేశారు. బేల, తాంసీ మండలాల్లో మహిళల మెడలో నుంచి గుర్తుతెలియని దుండగులు చైన్ స్నాచింగ్ చేసిన విషయం తెలిసిందే. స్నాచర్స్‌ను ఎవరైనా గుర్తుపడితే SDPO 8712659914, జైనథ్ సీఐ 8712659916, రూరల్ సీఐ 8712659915 నంబర్లకు సమాచారం ఇవ్వాలని DSP జీవన్ రెడ్డి కోరారు. గుర్తుతెలియని వ్యక్తుల పట్ల మహిళలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.

Similar News

News June 29, 2024

MNCL: మటన్‌తో పోటీపడుతున్న బోడకాకరకాయ ధర

image

వర్షాకాలం ప్రారంభంలో మాత్రమే లభించే బోడకాకరకాయ ధర ఆకాశాన్నంటుతోంది. మంచిర్యాల జిల్లా కేంద్రంలో బోడకాకరకాయ కిలో రూ.600 అమ్ముతున్నారు. మార్కెట్‌లో ఆ ధర చూసిన కొనుగోలుదారులు అవాక్కయ్యారు. కిలో చికెన్ రూ.240, మటన్ కిలో రూ.800ఉండగా.. బోడకాకరకాయ ధర రూ.600 పలకడం విశేషం.

News June 29, 2024

ఉట్నూర్: అధికారులతో ఐటీడీఏ పీఓ సమావేశం

image

ప్రధానమంత్రి జన జాతీయ న్యాయ మహా అభియాన్ పథకాన్ని త్వరితగతిన పూర్తిచేయాలని ఐటీడీఏ పీఓ ఖుష్బూ గుప్తా ఆదేశించారు. శుక్రవారం కార్యాలయంలో అధికారులతో సమావేశం నిర్వహించారు. పథకం అర్హులైన లబ్ధిదారులకు ఆధార్, క్యాస్ట్ సర్టిఫికెట్, మొబైల్ నంబర్లను 15 రోజుల్లో కచ్చితంగా పూర్తిచేయాలని ఆదిలాబాద్, ఆసిఫాబాద్ జిల్లాల మండల తహసిల్దార్లను ఆదేశించారు. ఐటీడీఏ కోర్ట్ కేసులపై ప్రత్యేకదృష్టి సారించాలన్నారు.

News June 28, 2024

ఆదిలాబాద్: జీవితంపై విరక్తి చెంది వ్యక్తి ఆత్మహత్య

image

మద్యానికి బానిసై వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ ఘటన తానూర్ మండలం కోలూరులో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన దేవక్వాడ్ అశోక్ (31) మద్యానికి బానిసై జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం తన పంట చేనులో ఓ చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.