News December 1, 2025
ఆదిలాబాద్: గుర్తుల పంచాయితీ!

పంచాయతీ ఎన్నికల్లో పార్టీ గుర్తులుండవు. సర్పంచ్‌కు గులాబీ రంగు, వార్డు సభ్యులకు తెలుపు రంగు బ్యాలెట్ పేపర్లు కీలకం కానున్నాయి. సర్పంచ్ గుర్తుల్లో ఉంగరం, కత్తెర బాగానే ఉన్నా, బ్యాట్, టీవీ రిమోట్లు, సాసర్, పలక, బ్లాక్ బోర్డు వంటివి ఒకేలా ఉండటంతో ఓటర్లు గందరగోళానికి గురయ్యే అవకాశం ఉంది. ప్రచారం సరిగా చేయకపోతే ఓట్లు మారే ప్రమాదం ఉంది.
Similar News
News April 15, 2026
విమానంలో ఫోన్ వాడితే డేంజరా?

విమానంలో ప్రయాణికుల ఫోన్లను కచ్చితంగా ఫ్లైట్ మోడ్‌లో పెట్టుకోమంటారు. అలా చేయకపోతే డేంజరనే భయం కొందరిలో ఉంటుంది. అయితే ఫోన్ ఫ్లైట్ మోడ్‌లో లేనంత మాత్రాన ప్లేన్ కూలిపోదని, కానీ కొంత రిస్క్ ఉందంటున్నారు పైలట్లు. ‘ఫ్లైట్ మోడ్‌లో లేకుంటే ఫోన్లు సిగ్నల్స్ రాబట్టేందుకు యత్నిస్తాయి. పైలట్ల హెడ్‌సెట్స్‌కు వచ్చే రేడియో వేవ్స్ డిస్ట్రబ్ అయ్యి శబ్దం వస్తుంది. ఫలితంగా ఏకాగ్రత దెబ్బతింటుంది’ అని చెబుతున్నారు.
News April 15, 2026
హార్దిక్ నిర్ణయాలపై రోహిత్ సంతృప్తిగా లేరు: మాజీ క్రికెటర్

హార్దిక్ చెత్త నిర్ణయాల వల్లే RCB చేతిలో ముంబై ఓడిపోయిందని మాజీ క్రికెటర్ సడగొప్పన్ రమేశ్ అభిప్రాయపడ్డారు. ‘MIకి హార్దిక్ కెప్టెన్సీనే పెద్ద సమస్య. 7, 8వ ఓవర్లు వరుసగా స్పిన్నర్లకు ఇచ్చాడు. పాటీదార్ ఉన్నప్పుడు ఇలా చేయడం పెద్ద తప్పు. డేవిడ్‌కు హై ఫుల్ టాస్ వేసి DRSకు వెళ్లడంతో సూర్య షాకయ్యాడు. అటు రోహిత్ కూడా హార్దిక్ నిర్ణయాలపై సంతృప్తిగా లేనట్లు క్లియర్‌గా కనిపించింది’ అని తెలిపారు.
News April 15, 2026
సిరిసిల్ల: వృద్ధురాలి దారుణ హత్య

వృద్ధురాలు దారుణ హత్యకు గురైన ఘటన సిరిసిల్ల పట్టణంలో చోటుచేసుకుంది. రాజీవ్ నగర్‌కు చెందిన కోన లక్ష్మమ్మ (75) ఒంటరిగా నివసిస్తుంది. మంగళవారం ఉదయం చిన్న కుమారుడు వెంకటేశ్ తల్లి వద్దకు వచ్చేసరికి ఆమె రక్తం మడుగులో పడి ఉంది. దీంతో పోలీసులకు సమాచారం అందించగా, సీఐ శ్రీనివాస్ ఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


