News October 13, 2025
ఆదిలాబాద్: గుస్సాడీ టోపీలకు ఆదివాసీ ఆడపడుచుల పూజలు

ఆదివాసీలు ప్రతిష్ఠాత్మకంగా జరుపుకునే గుస్సాడీ పండుగ సందడి ఆదివాసీ గ్రామాల్లో ప్రారంభమైంది. సొనాల మండలంలోని పార్డి(K) గ్రామంలో దీపావళి ముందు వచ్చే భోగి పండుగను జరుపుకున్నారు. ఈ రోజున ఆదివాసీ ఆడపడుచులు గుస్సాడీ టోపీలకు ప్రత్యేక నైవేద్యాలు సమర్పించి పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఆదివాసీ గ్రామ పెద్దలు, మహిళలు పాల్గొన్నారు.
Similar News
News October 13, 2025
బెల్లంపల్లి: కబ్జాల నుంచి ప్రభుత్వ భూములను కాపాడండి

బెల్లంపల్లి మండలం కన్నాల గ్రామపంచాయతీ పరిధిలోని ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాలని మాజీ సర్పంచి అనిత కోరారు. ప్రజావాణిలో కలెక్టర్ దీపక్ కుమార్ వినతిపత్రం అందజేశారు. రాత్రికి రాత్రి చదును చేయించి ప్లాట్లుగా విభజించి అక్రమ నిర్మాణాలు చేపడుతున్నారని వాపోయారు. అక్రమ నిర్మాణాలకు ఇంటి నంబర్లు, కరెంటు మీటర్లు ఇచ్చి రూ.కోట్లకు అమ్ముకుంటున్నారని కలెక్టర్‌కు వివరించారు.
News October 13, 2025
GWL: CPR పై అవగాహన కలిగి ఉండాలి- కలెక్టర్ సంతోష్

సీపీఆర్‌పై ప్రతి ఒక్కరు అవగాహన కలిగి ఉండాలని గద్వాల కలెక్టర్ సంతోష్ పేర్కొన్నారు. సోమవారం ఐడీఓసీ మందిరంలో వైద్య శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సీపీఆర్ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజా జీవితంలో ఆకస్మాత్తుగా గుండెపోటు వచ్చి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని అలాంటి వారికి సీపీఆర్ చేస్తే ప్రాణాపాయం నుంచి బయటపడతారని చెప్పారు. ఈనెల 13 నుంచి 17 వరకు సీపీఆర్ పై అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు.
News October 13, 2025
గద్వాల ప్రజావాణిలో 72 ఫిర్యాదులు

ప్రజావాణి కార్యక్రమంలో వచ్చే ఫిర్యాదులకు అధిక ప్రాధాన్యతనిస్తూ సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ సంతోష్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం గద్వాల సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయంలోని సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా తమ సమస్యలు తెలపడానికి వచ్చిన ప్రజల నుండి 72 ఫిర్యాదులను కలెక్టర్ స్వీకరించారు.