News February 15, 2025

ఆదిలాబాద్: చోరీ కేసులో ఇద్దరు ARREST

image

ఈనెల 11న ఆదిలాబాద్‌లోని నటరాజ్ థియేటర్ వద్ద పాన్ షాప్‌లో చోరీ కేసులో ఇద్దరు నిందితులను వన్ టౌన్ పోలీసులు శుక్రవారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. CI సునీల్ తెలిపిన వివరాలు.. SI పద్మ NTR చౌక్ వద్ద వాహన తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా వెళ్తున్న మహాలక్ష్మీవాడకు చెందిన రతన్, వడ్డెర కాలనీకి చెందిన మల్లన్నను అదుపులోకి తీసుకుని విచారించారు. పాన్ షాప్‌లో చోరీ చేసినట్లు అంగీకరించడంతో అరెస్ట్ చేశారు.

Similar News

News March 13, 2025

ADB: కామదహనం ఏర్పాట్లు చేస్తున్న ఆదివాసీలు

image

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదివాసీ గూడ, తండాల్లో గురువారం సుమారు 8 గంటలకు జరిగే కామదహనం నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో ఆదివాసీ పెద్దలు కలిసి ప్రత్యేక ఏర్పాట్లు చేస్తున్నారు. రంగుల పండుగ హోలీని పురస్కరించుకొని జరుగుతున్న ఈ వేడుకలలో కొబ్బరి, నైవేద్యాలతో కూడిన పదార్థాలతో సంబరాలు చేసుకుంటారు. వాటిని వెదురుతో అంటించిన మంటల్లో పెట్టి పోటీలు నిర్వహిస్తారు.

News March 13, 2025

ఆదిలాబాద్ ప్రజలకు ఎస్పీ సూచనలు

image

ఇతరులకు ఇబ్బంది కలిగించకుండా హోలీ పండుగను ఘనంగా జరుపుకోవాలని ఆదిలాబాద్ ఎస్పీ అఖిల్ మహాజన్ పేర్కొన్నారు. హోలీ వేడుకలు ప్రశాంతంగా నిర్వహించాలని, నదులు, వాగులు, చెరువులకు ఈతరాని వారు వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై జాగ్రత్తలు వహించాలన్నారు. మైనర్లకు వాహనాలు ఇవ్వరాదని, రాష్ డ్రైవింగ్, ట్రిపుల్ రైడింగ్, డ్రంక్ అండ్ డ్రైవ్ వంటివి చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.

News March 13, 2025

ఇంద్రవెల్లి: భార్య కాపురానికి రావడం లేదని సూసైడ్

image

భార్య కాపురానికి రావడం లేదని నిప్పంటించుకొని ఆత్మహత్యానికి పాల్పడిన ఘటన ఇంద్రవెల్లి మండలంలో చోటు చేసుకుంది. ఏఎస్సై రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం.. కుబీర్ మండలం మర్లకొండాకు చెందిన కృష్ణ ADBలో లారీ డ్రైవర్‌గా పనిచేస్తున్నారు. మద్యానికి బానిసై భార్య సంగీతను వేధించాడు. దీంతో ఆమె ఇంద్రవెల్లి మండలం శంకర్‌గూడకు వచ్చి ఉంటున్నారు. ఈనెల 2న కృష్ణ మద్యం తాగి భార్యతో గొడవపడి సూసైడ్ చేసుకున్నారు.

error: Content is protected !!