News August 27, 2024
ఆదిలాబాద్: చోరీ కేసులో నలుగురి అరెస్ట్

చోరీ కేసులో నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్ఐ విష్ణువర్ధన్ తెలిపారు. ఆదిలాబాద్ లోని కే.ఆర్.కే కాలనీలో నివాసం ఉండే పెన్నేశ్వరి ఇంట్లో ఇటీవల చోరీ జరిగింది. దీంతో ఆమె మావల పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేస్ దర్యాప్తు చేయగా ఐదుగురు యువకులు చోరీ చేసినట్లు గుర్తించామన్నారు. వీరిలో అర్బాజ్, షెహబాజ్, సోహెల్, వాజిద్ లను అరెస్టు చేసినట్లు తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడు అశోక్ కోసం గాలిస్తున్నామన్నారు.
Similar News
News September 16, 2025
ADB: కాంగ్రెస్ గూటికి మాజీ నేతలు

TPCC అధ్యక్షుడు బొమ్మ మహేశ్ కుమార్ గౌడ్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన పలువురు మాజీ నేతలు తిరిగి కాంగ్రెస్ గూటికి చేరుకున్నారు. ఇందులో మాజీ TPCC ప్రధాన కార్యదర్శి గండ్రత్ సుజాత, మాజీ డీసీసీ అధ్యక్షుడు సాజీద్ ఖాన్, మాజీ మార్కెట్ కమిటీ ఛైర్మన్ అల్లూరి సంజీవరెడ్డి ఉన్నారు. ఈ సందర్భంగా వారు పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటి సీఎం భట్టి విక్రమార్కకు ధన్యవాదాలు తెలిపారు.
News September 16, 2025
ADB: మొదలై వెంటనే ముగిసిన ఓ తల్లి విషాద గాథ..!

సిరికొండ మండలం బీంపూర్‌కు చెందిన తోడసం ఏత్మ భాయి(20) ప్రసవం తర్వాత మృతి చెందడం విషాదాన్ని నింపింది. ఈనెల 12న పురిటి నొప్పులతో ఆమెను ఇంద్రవెల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, బాలుడికి జన్మనిచ్చింది. 14వ తేదీన డిశ్చార్జ్ అయ్యాక తీవ్రమైన తలనొప్పి రావడంతో 108లో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం సాయంత్రం మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు.
News September 16, 2025
ADB: OPEN స్కూల్ అడ్మిషన్‌లకు గడువు పొడిగింపు

టెన్త్, ఇంటర్మీడియట్ ఓపెన్ స్కూల్ అడ్మిషన్ల కోసం గడువును పొడగించినట్లు జిల్లా విద్యాధికారి (డీఈఓ) ఖుష్బూ గుప్తా తెలిపారు. ఎలాంటి అపరాధ రుసుము లేకుండా ఈనెల 12వ తేదీ వరకు అవకాశం ఉండగా 18 వరకు పొడగించినట్లు పేర్కొన్నారు. అపరాధ రుసుంతో సెప్టెంబర్ 20వ తేదీ వరకు గడువు ఉందని వెల్లడించారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని విద్యార్థులకు సూచించారు.