News March 20, 2025
ఆదిలాబాద్ జిల్లాకు ఎల్లో అలెర్ట్.. మూడ్రోజులు వర్షాలు

రానున్న మూడు రోజులు ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గాలులతో కూడిన వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. రాబోయే మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు తగ్గినా.. తర్వాత మళ్లీ పెరిగే అవకాశం ఉందని తెలిపింది. ఎండవేడితో అల్లాడుతున్న ప్రజలకు ఇది కాస్త ఉపశమనం చేకూర్చనుంది. కానీ చేతికొస్తున్న పంటలకు నష్టం జరిగే అవకాశం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు.
Similar News
News March 21, 2025
ADB: ACB కేసులో తప్పుడు సాక్ష్యం.. ముగ్గురిపై కేసు

కోర్టులో తప్పుడు సాక్ష్యం చెప్పిన ముగ్గురి పై కేసు నమోదు చేయాలని కరీంనగర్ ACB స్పెషల్ కోర్టు జడ్జీ తీర్పునిచ్చారు. ఆదిలాబాద్ జిల్లాలో 2010లో లంచం తీసుకుంటూ ACBకి చిక్కిన అసిస్టెంట్ డివిజనల్ ఇంజినీర్ (ADE) రేగుంట స్వామి కేసులో ఇచ్చోడ మండలానికి చెందిన కన్నమయ్య, నారాయణ, మల్లయ్య తప్పుడు సాక్ష్యం చెప్పారు. దీంతో వారిపై క్రిమినల్ కేసు నమోదుకు కోర్టు ఆదేశించింది.
News March 21, 2025
ADB: BC స్టడీ సర్కిల్ ఘనత.. గ్రూప్స్లో సత్తాచాటిన 25 మంది

ఆదిలాబాద్ బీసీ స్టడీ సర్కిల్ ఆధ్వర్యంలో అందించే ఉచిత శిక్షణలు సద్వినియోగం చేసుకోవాలని స్టడీ సర్కిల్ డైరెక్టర్ ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు. ఇటీవల విడుదలైన గ్రూప్స్ ఫలితాల్లోమంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. గ్రూప్-1 లో ఏడుగురు, గ్రూప్ 2లో 15 మంది, గ్రూప్-3 లో ఐదుగురు మంచి మార్కులు సాధించినట్లు పేర్కొన్నారు. అదేవిధంగా జూనియర్ లెక్చరర్లో ఐదుగురు ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారని పేర్కొన్నారు.
News March 21, 2025
నార్నూర్ వాసికి CM ద్వారా నియామకపత్రం

నార్నూర్ మండల కేంద్రానికి చెందిన బానోత్ సూరజ్ సింగ్-ప్రణీత దంపతుల కుమారుడు బానోత్ సోను సింగ్ ఇటీవల టౌన్ ప్లానింగ్ ఆఫీసర్గా ఉద్యోగం సాధించారు. ఈ సందర్భంగా గురువారం రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు ఉద్యోగ నియామకపత్రాన్ని అందజేసి అభినందించారు. కార్యక్రమంలో వేణుగోపాల్, బంజారా నాయకులు పాల్గొన్నారు.