News December 11, 2025
ఆదిలాబాద్ జిల్లాలో మహిళదే విజయం

ఇచ్చోడ మండల పరిధిలోని 28 గ్రామ పంచాయతీల్లో సర్పంచ్ ఎన్నికలు ప్రశాంతంగా ముగిశాయి. మండలంలోని హీరాపూర్ గ్రామానికి చెందిన రాథోడ్ లత విజయం సాధించారు. ప్రత్యర్థి రాథోడ్ మనోజ్‌పై 50 ఓట్ల తేడాతో రాథోడ్ లత గెలుపొందారు. ఈ గ్రామపంచాయతీలో 8 వార్డు స్థానాలకు సభ్యులను ఎన్నుకున్నారు. .
Similar News
News March 3, 2026
హోలీ వేడుకల్లో జాగ్రత్తలు తప్పనిసరి: ఎస్పీ అఖిల్ మహాజన్

హోలీని శాంతియుతంగా, స్వీయ భద్రతా జాగ్రత్తలతో జరుపుకోవాలని ఎస్పీ అఖిల్ మహాజన్ సూచించారు. మంగళవారం విలేకరులతో మాట్లాడుతూ.. ప్రజలు వీలైనంత వరకు సహజసిద్ధమైన రంగులనే వాడాలని కోరారు. యువత, చిన్నారులు ఉత్సాహంలో వాగులు, నదులు, లోతట్టు ప్రాంతాల్లో ఈతకు వెళ్లి ప్రమాదాల బారిన పడొద్దని హెచ్చరించారు. ఈత రాని వారు నీటిలోకి వెళ్లవద్దని, తల్లిదండ్రులు తమ పిల్లల కదలికలపై నిరంతరం నిఘా ఉంచాలని విజ్ఞప్తి చేశారు.
News March 2, 2026
హోలీ వేడుకలు ప్రశాంతంగా జరుపుకోవాలి: ADB SP

హోలీ పండుగను మతసామరస్యంతో, శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని ఆదిలాబాద్ SP అఖిల్ మహాజన్ సూచించారు. జిల్లావ్యాప్తంగా పటిష్ఠ బందోబస్తుతో పాటు ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు చేపట్టామన్నారు. డీజేలకు అనుమతి లేదని, ఎవరిపై బలవంతంగా రంగులు చల్లరాదని హెచ్చరించారు. ఈత రానివారు చెరువులు, వాగుల వద్దకు వెళ్లకూడదని.. నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు.
News March 2, 2026
ADB: పరీక్ష దరఖాస్తు గడువు పొడిగింపు

ఆదిలాబాద్ జిల్లాలోని ఆదర్శ పాఠశాలలు బంగారుగూడ, జైనథ్, బజార్హత్నూర్, నార్నూర్, గుడిహత్నూర్, బోథ్ ప్రవేశ పరీక్ష -2026-27 విద్యా సంవత్సరానికి VI తరగతిలో ప్రవేశాలకు గడువు తేదీని పొడగించినట్లు DEO రాజేశ్వర్ పేర్కొన్నారు. అలాగే VII నుంచి X తరగతుల ఖాళీ సీట్ల భర్తీకి నిర్వహించనున్న ప్రవేశ పరీక్ష ఆన్‌లైన్ దరఖాస్తుల సమర్పణ మార్చి10 వరకు పొడగించమన్నారు. ఏప్రిల్ 19న పరీక్ష ఉంటుందని తెలిపారు.


