News December 29, 2025
ఆదిలాబాద్ జిల్లాలో యూరియా కొరత లేదు

రాష్ట్రంలో ప్రతి రైతుకు పంట అవసరాలకు సరిపడినంత యూరియాను తప్పనిసరిగా అందించాలని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టర్లు, అధికారులతో యూరియా పంపిణీపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం ADB కలెక్టర్ రాజర్షిషా మాట్లాడుతూ.. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదని తెలిపారు. రైతుల అవసరాలకు అనుగుణంగా అందుబాటులో ఉన్న యూరియాను పకడ్బందీగా పంపిణీ చేయాలని సూచించారు.
Similar News
News December 29, 2025
మున్సిపల్ ఎన్నికలు.. JAN 10న ఓటరు జాబితా

TG: రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలకు ఎలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల వారీగా ఓటర్ల జాబితా సిద్ధం చేయాలంటూ షెడ్యూల్ విడుదల చేసింది. JAN 1న ముసాయిదా ఓటరు జాబితాలు ప్రదర్శించి, అభ్యంతరాలు స్వీకరించాలని అధికారులను ఆదేశించింది. అదే నెల 10న తుది ఓటరు జాబితాను విడుదల చేయాలని పేర్కొంది. కాగా ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.
News December 29, 2025
రా.1.30గంటల నుంచి వీఐపీ దర్శనాలు

తిరుమల శ్రీవారి ఆలయంలో నేటి అర్ధరాత్రి 12 గంటలకు వైకుంఠ ద్వారాలు తెరుచుకోనున్నాయి. ధనుర్మాస కైంకర్యాల అనంతరం రాత్రి 1:30 గంటల నుంచి వీఐపీలకు, వేకువజామున 5 గంటల నుంచి స్లాటెడ్ టికెట్లు కలిగిన భక్తులకు దర్శనం కల్పిస్తారు. జనవరి 1వ తేదీ వరకు టికెట్ల కలిగిన భక్తులను మాత్రమే దర్శనానికి అనుమతిస్తారు. 2 నుంచి 8 వరకు సర్వదర్శనం ఉంటుంది.
News December 29, 2025
బల్దియా సమరం: కామారెడ్డి జిల్లాలో తేలిన మున్సిపాలిటీల లెక్కలు

కామారెడ్డి జిల్లాలోని స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి జాబితా విడుదలైంది. KMRలో 49 వార్డుల్లో 1,04,213 మంది ఉన్నారు. ఇందులో SCలు 9,495, STలు 1,236 మంది ఉన్నారు. బాన్సువాడలో 19 వార్డులు ఉండగా 28,384 మంది జనాభా, SCలు 3,026, STలు 791గా నమోదయ్యారు. బిచ్కుందలో 12 వార్డుల్లో 16,081 మంది ఉండగా SCలు 2,116, STలు 620 మంది ఉన్నారు. ఎల్లారెడ్డిలో 12 వార్డుల్లో 19,750 మంది SCలు 2,249, STలు 441 ఉన్నారు.


