News April 19, 2025

ఆదిలాబాద్: డిగ్రీ పరీక్షలు వాయిదా

image

కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఈ నెల 21 నుంచి జరగనున్న డిగ్రీ పరీక్షలను వాయిదా వేస్తున్నట్లు KU అధికారులు వెల్లడించారు. కొన్ని ప్రైవేట్ కళాశాలలు తమ విద్యార్థుల పరీక్ష ఫీజును చెల్లించలేదని, ఈ నేపథ్యంలో వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. II, IV, VI (రెగ్యులర్) & I, III.V సెమిస్టర్‌ల (బ్యాక్ లాగ్) పరీక్షలు వాయిదా వేశామని, మళ్లీ పరీక్షలు నిర్వహించే తేదీని త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.

Similar News

News December 14, 2025

నల్గొండ: ‘గెలుపే లక్ష్యం.. ప్రలోభాల పర్వం’

image

జిల్లాలో మొదటి విడత పోలింగ్ ఫలితాలను అనుభవంగా తీసుకుంటూ, రెండో విడతలో ఎలాగైనా గెలుపే లక్ష్యంగా మిర్యాలగూడ నియోజకవర్గ సర్పంచ్, వార్డుమెంబర్ అభ్యర్థులు ముందుకెళ్తున్నారు. 10 మండలాల్లోని అభ్యర్థులు వ్యూహాలు రచిస్తూ, పోలింగ్‌కు ముందురోజు రాత్రి నుంచి ఓటర్లను ఆకర్షించే పనిలో నిమగ్నమయ్యారని ప్రజలు అంటున్నారు. ప్రజాస్వామ్య పండగగా ఉండాల్సిన ఎన్నికలు డబ్బు, గిఫ్టుల పోటీగా మార్చేశారని ఆరోపిస్తున్నారు.

News December 14, 2025

21న నింగిలోకి ‘బ్లూబర్డ్-6’ శాటిలైట్

image

AP: కీలకమైన వాణిజ్య ప్రయోగానికి ISRO సిద్ధమవుతోంది. USకు చెందిన 6,500KGల కమ్యూనికేషన్ శాటిలైట్‌ బ్లూబర్డ్-6ను శ్రీహరికోట నుంచి ఈ నెల 21న ప్రయోగించనుంది. బాహుబలి రాకెట్ LVM3-M6 ద్వారా నింగిలోకి పంపనుంది. ఈ ఉపగ్రహం 10రెట్ల అధిక డేటా సామర్థ్యంతో పనిచేస్తుందని సైంటిస్టులు తెలిపారు. కాగా ఈ నెల 31న PSLV C-62 ప్రయోగాన్ని నిర్వహించేందుకు ISRO ఏర్పాట్లు చేస్తోంది. 10 రోజుల్లో 2 ప్రయోగాలు చేయనుండటం విశేషం.

News December 14, 2025

లంపిీ స్కిన్ నివారణకు ఆయుర్వేద మందు

image

ఆయుర్వేద మందుతో లంపిీ స్కిన్ నుంచి పశువును కాపాడవచ్చు. ఒక మోతాదు మందు కోసం 10 తమలపాకులు, 10 గ్రా. మిరియాలు, 10 గ్రా. ఉప్పు, 100 గ్రాముల బెల్లం తీసుకొవాలి. తమలపాకులు, మిరియాలు, ఉప్పు, కలిపి మెత్తని మిశ్రమంలాగా చేసుకోవాలి. దీన్ని బెల్లంతో కలిపి లడ్డులాగా చేసి మొదటి రోజు ప్రతి మూడు గంటలకు ఒకసారి తాజాగా చేసి ఒక మోతాదును తినిపించాలి. రెండవ రోజు నుంచి రోజుకు మూడుసార్లు, ఇలా వారం రోజుల వరకు తినిపించాలి.